రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన శ్రీప్రగతి హైస్కూల్ విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలో భాగంగా వరంగల్ లో ఉన్న వేయ్యి స్తంభాల దేవాలయం, జూ, భద్రకాళి దేవాలయం, పోర్ట్ లను సందర్శించడం జరిగినది. ఈసందర్భంగా కరస్పాండెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు వినోదవిహారయాత్రలు, ఆటల పోటీలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. ఈవిజ్ఞాన విహారయాత్రలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, నాలుగు, ఐదు, ఆరవ తరగతి విద్యార్థులు, తదితరులున్నారు.