విద్యార్థుల నైపుణ్య అభివృద్ధి దిశగా పటిష్ట చర్యలు….. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

ఐటిఐ అప్ గ్రేడేషన్ కోసం క్యాబినెట్ 4 కోట్ల మంజూరు

విద్యార్థులకు త్వరగా ఉపాధి లభించేలా నైపుణ్యాలు పెంచుకోవాలి

విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు ఆంగ్ల భాష పరిజ్ఞానం అందించేలా చర్యలు

కాటారం పాలిటెక్నిక్ కళాశాల బాలుర వసతి గృహాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

కాటారం, నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి చేసే దిశగా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రతి విద్యార్థికి కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి లభించే విధంగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాలిటెక్నిక్ కళాశాలలో మూడు కోట్లతో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ గతంలో వైయస్సార్ ఆధ్వర్యంలో మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం మంచి విద్య అవకాశాలు అందించాలని కాటారం మండలంలో ఐటిఐ పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, పది సంవత్సరాల తర్వాత మరో మారు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు లభించిందని అన్నారు.
3 కోట్లతో నూతనంగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతి గృహం లో కోంత భాగం ప్రత్యేకంగా బాలికలకు కేటాయించాలని త్వరలో బాలికలకు సైతం ప్రత్యేకంగా వసతి గృహం నిర్మాణానికి కృషి చేస్తామని, ఇప్పటివరకు బాలికలకు సైతం అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా కలెక్టర్ కు సూచించారు.
పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలో చదివే విద్యార్థులకు కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి లభించే విధంగా వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం తరఫున చేపడుతామని, పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలను తెలుసుకుంటూ అది విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఐటీఐ , పాలిటెక్నిక్ కళాశాలలో పరిశ్రమలకు అవసరమైన నూతన కోర్సులు సైతం ప్రవేశపెడతామని అన్నారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.
ప్రస్తుత మార్కెట్లో మనకు మంచి ఉద్యోగం లభించాలంటే నైపుణ్యంతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఆంగ్ల పరిజ్ఞానం చాలా అవసరమని వీటిపై సైతం విద్యార్థులకు శిక్షణ అందించే విధంగా పాలిటెక్నిక్ కళాశాలలో చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాటారం ఐటిఐ కళాశాలను అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్ 4 కోట్లు నిధులు మంజూరు చేసిందని, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల సైతం అభివృద్ధి చేసే దిశగా త్వరలో నిధులు మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు.
కళాశాలలో ని లెక్చరర్లకు 317 జీ . ఓ. సమస్యలు ఉన్నాయని వాటిని సైతం ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని, విద్యార్థులు అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
అనంతరం కాటారం మండలం కేంద్రం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో 16 లక్షల రూపాయల ఎన్.హెచ్.ఎం. నిధుల తో నిర్మించిన బర్త్ వేటింగ్ రూమ్ ను, 20 లక్షల రూపాయల సి.ఎస్.అర్ నిధులతో నిర్మించిన మెడికల్ ఆఫీసర్ క్వార్టర్స్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎం.పింపి. సమ్మయ్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, జెడ్ పి.టి.సి.లు , ఎం.పి.పి. లు , సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *