Headlines

తెలంగాణ ‘‘బిజెపి’’లో ‘‘ప్రక్షాళన జరగాలి’’ ఎపిసోడ్‌ – 2

https://epaper.netidhatri.com/

యువతకు పగ్గాలివ్వండి.

బిజెపి దశ మారకపోతే అడగండి

ప్యారాచూట్‌ లీడర్లను పక్కన పెట్టండి.

అవకాశవాదులను దరి చేరనీయకండి.

రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం ఇవ్వకండి.

పదవుల కోసం వచ్చేవారికి పీటలు వేయకండి.

ఇతర పార్టీలనుంచి వచ్చిన వారు ఉద్దరించింది లేదు.

పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచింది లేదు.

పార్టీ కోసం సర్వం కోల్పోయిన వాళ్లున్నారు.

పార్టీకి కన్నీటితో అభిషేకాలు చేస్తున్నారు.వారిని గుర్తించండి.నాయకులను చేయండి.

పార్టీకి పటిష్ఠమైన పునాదులు వేయండి.

పార్టీకి పెట్టని గోడలు కార్యకర్తలే అన్నది మరవకండి.

ఒక్కసారి వారికి అవకాశం ఇచ్చి చూడండి.

సనాతన ధర్మాన్ని నిలబెట్టేది బిజేపి. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేది బిజేపి. దేశానికి సైనికుల్లా సేవ చేసేది బిజేపి. హైందవ వాదానిని, హిందుత్వ వాద సిద్దాంతానికి నిలువెత్తు నిదర్శనం బిజేపి. సనాతన ధర్మాల మార్గ దర్శి బిజేపి. విదేవీ విషభీజాలను దేశంలోకి జొచ్చుకొని రాకుండా, హైందవం కలుషితం కాకుండా, భారతీయ అస్ధిత్వాన్ని కాపాడేది బిజేపి. ఆ సేతు హిమాచలమంతా ఒక్కటిగా నిలిపేది బిజేపి. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజేపి. దేశ రక్షణ కోసం కాపాలా కాసేది బిజేపి. దేశ శ్రేయస్సు కోసం తపించేది, దేశ యసస్సును కాంక్షించేది బిజేపి. దేశ సౌభాగ్యాం కోసం కృషి చేసేది బిజేపి. దేశ ఔన్నత్యం కోసం పరితపించేది బిజేపి. సనాతన ధర్మ ఆశయాలను కొనసాగించేది బిజేపి. అందుకే బిజేపి అంటే ఈ తరానికి ఒక యాగం, యజ్ఞం.. దేశ భవితకు మార్గం. నేను హిందువునని సగర్వంగా సగటు భారతీయుడు తలెత్తుకొని నినదించేందుకు అండగా నిలిచేది బిజేపి. ఆ స్వేచ్ఛను ప్రసాదించింది బిజేపి. అందుకే బిజేపి దేశం నిండిపోయింది. జనం హృదయాలలో పదిలమైంది. ప్రతి హృదిలో గూడు కట్టుకొనివుంది. కాకపోతే చిన్న వెలితి. ఉత్తరాధిన నిండిన బిజేపి దక్షిణాదిన కూడా జెండా ఎగరకపోవడమే అసంతృప్తి. అది కూడా నెరవేరాలంటే ముఖ్యంగా తెలంగాణలో యువతకు పగ్గాలివ్వండి. పారాచ్యూట్‌ లీడర్లను పక్కన పెట్టండి. అవకాశవాదులను దరి చేరనివ్వకండి.
రాజకీయ నిరుద్యోగులు బిజేపిని ఆశ్రయం చేయకండి. వారికి ఆశ్రయం కల్పించకండి. నాయకులను తయారు చేసే గొప్ప శక్తి, యుక్తి వున్న ఏకైక పార్టీ బిజేపి. బిజేపి కావాలంటే, కోరుకుంటే దేశంలో కొన్ని కోట్ల మంది యువత బిజేపి వైపు అడుగులు వేయడానికి సిద్దంగా వున్నారు. ఇప్పటికీ యువతే బిజేపికి ఆయువుపట్టుగా వున్నారు. బిజేపిని కాపాడుకుంటున్నారు. బిజేపి క్యాడర్‌లో వున్న గొప్ప గుణం మరే పార్టీలో వుండదు. పదవుల కోసం ఆశించరు. పార్టీ తమకేమిస్తుందని ఆలోచించరు. బిజేపిలో చేరితే లాభం ఏమిటన్నది మనసులోకి రానివ్వరు. నేను దేశం కోసం, ధర్మంకోసం, బిజేపి కోసం అంటూ కొన్ని కోట్ల మంది యువత కదిలేందుకు, బిజేపికి మద్దతిచ్చేందుకు సిద్దంగా వున్నారు. కాని వారిని నడిపించే నాయకులు రాష్ట్రాలలో లేరు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాల ద్వయం ఆదర్శంగా ఎంతో అలాంటి నాయకత్వాలు రాష్ట్రాలలోనూ కావాలి. అలాంటి వారి కోసం తెలంగాణ బిజేపి చూస్తోంది. తెలంగాణలో బిజేపి కోసం అలా పనిచేస్తున్న వాళ్లు చూలా మంది వున్నారు. కాని వాళ్లు ఎక్కడా ఎలాంటి స్వార్ధం చూపించడం లేదు. నిస్వార్ధంగా పనిచేస్తున్నారు. అలాంటి వారిని కాపాడుకోవాల్సిన అవసరం వుంది. పార్టీ కోసం జీవితం అంకితం చేసేవాళ్లు ఎంతో మంది వున్నారు. వారి అభిప్రాయలు తీసుకోండి. వారి అభిప్రాయాలకు విలువివ్వండి. వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి. నాయకుడిని కూడా వారిలోనుంచే ఎంపిక చేయండి. అప్పుడు బిజేపి సత్తా ఏమిటో తెలుస్తుంది. బిజేపి శక్తి ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది. రాజకీయంలో సునామీ సృష్టిస్తుంది.
రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం కల్పించకండి. పదవులకోసం బిజేపిదరి చేరిన వారికి పెద్ద పీటలు వేయకండి. సనాతన ధర్మం మీద నమ్మకం లేని నాయకులను తీసుకోండి. ధర్మం అన్న పదం తప్ప, దేశం అన్న మమకారం వున్నప్పుడే బిజేపి కోసం పనిచేస్తారు. లేకుంటే స్వార్ధం కోసం పనిచేస్తారు. పదవులు అందకుంటే మళ్లీ ఎవరి దారి వారు చూసుకుంటారు. అలాంటి రాజకీయ టూరిస్టులను ఆదరించకండి. ఇతర పార్టీల నుంచి వచ్చి ఉద్దరించిన వారు ఎవరూ లేరు. పార్టీని నిలబెడుతున్నది వారు కాదు. పార్టీ కోసం వారు చేసిన త్యాగాలేమీ లేవు. గత ఎన్నికల ముందు ఎంత మంది బిజేపిని వదిలి వెళ్లారో తెలుసు. నాలుగేళ్ల క్రితం తెలంగాణలో బిజేపియే బలమైందని నమ్మిన వాళ్లకు, ఎన్నికల ముందు ఎందుకు హఠాత్తుగా బిజేపి మీద నమ్మకం కలగలేదు. కొత్తగా వచ్చిన వారితో వచ్చిన కార్యకర్తలు వేలల్లో లేరు. లక్షల్లో లేరు. కనీసం పదుల్లో కూడా సరిగ్గా లేరు. కాని అంతకు ముందు వున్న బలమైన బిజేపి క్యాడర్‌ ను చూసే బిజేపిలో చేరారు. అవకాశం వాదంతో వచ్చిన వారు, అవకాశాలు వెత్తుక్కుంటూ వెళ్తారు. అలా అందరూ వెళ్లిన వాళ్లే..మిగిలిన వాళ్లు ఎప్పుడు వెళ్తామా? అని ఎదురు చూస్తున్న వాళ్లే…ఇప్పటికైనా అర్ధంచేసుకోండి. రాజకీయ అవసరాల కోసం వచ్చిన వాళ్లు పార్టీ కష్ట కాలంలో వుంటే నిలబడరు. పార్టీ కోసం కలబడరు. కుర్చీలు దొరికితే మాత్రం కూర్చుంటారు. పెత్తనం చేస్తారు. పదువులు కావాలని కుంపట్లు పెడుతుంటారు. పార్టీ పలుచనౌతుందన్న వార్తలు వింటే చాలు ఎవరి దుప్పట్లు వాళ్లు దులుపుకుంటారు. తట్టాబుట్టా సర్ధేసుకొని వెళ్తుంటారు. అలా వచ్చిన వెళ్లిన వారు తెలంగాణలో చాలా మంది నాయకులు వున్నారు. అలాంటి వారిని నమ్మి అసలైన నాయకులను దూరం పెట్టారు. వారిని మానసిక క్షభకు గురిచేశారు. ఇక నుంచైనా అలా చేయకండి. పార్టీ కోసం పనిచేస్తున్నవాళ్లెవరు? పదవుల కోసం వచ్చిన వాళ్లేవరు? తెలుసుకోండి. పదవుల కోసం వచ్చిన వాళ్లు, రాజకీయ ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చిన వారికి పెద్తనమిచ్చి, టిక్కెట్లిస్తే వాళ్లు ఎవరూ గెలవలేదు. అదే సీట్లు అసలైన నాయకులకు ఇస్తే, కనీసం పార్టీ మరింత బలపడేది. క్యాడర్‌ మరింత కష్టపడేది. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే ప్యారాచూట్‌ లీడర్లు ఎప్పుడూ తమ అనుచరులకు ప్రాధాన్యతనిస్తారే గాని, హార్డ్‌ కోర్‌ కార్యకర్తలకు విలువ ఇవ్వరు. ఇక్కడ అదే జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో బిజేపికి తీరని నష్టం చేకూర్చింది.
పార్టీ కోసం సర్వం కోల్పోయిన వాళ్లు ఎంతోమంది వున్నారు. పార్టీ పనుల కోసం నిస్వార్దంగా పనిచేసే వాళ్లు అనేకం వున్నారు. వారిపై ఇతరపార్టీల నుంచి వచ్చిన వారు పెత్తనం చేయడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. పార్టీకి కష్ట కాలం వచ్చినా అండగా వుండేది కార్యకర్తలే. పార్టీని కన్నీటితో కూడా అభిషేకం చేసుకుంటూ కాపాడుకునేది కార్యకర్తలే. ముందు వారిని గుర్తించండి. ఇంటి మీద కాషాయజెండా ధైర్యంగా కట్టుకొని, ఎగిరే బిజేపి జెండను నిత్యం తలెత్తుకొని చూసుకుంటూ, వందనం చేస్తూ మురిసిపోయే కార్యకర్తలు కొన్ని కోట్ల మంది వున్నారు. వారిలో నుంచి నాయకులను తయారు చేయండి. ఒకనాడు ఇద్దరు ఎంపిలతో మొదలైన ప్రస్ధానం నేడు మూడు వందల స్ధానాలు, 19 రాష్ట్రాలలో అదికారం అంటే బిజేపి కర్మాగారం నుంచి తయారైన నాయకులే అన్నది ఎవరూ మర్చిపోవద్దు.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ కాకుండా బిజేపి గెలవాల్సిన ఎన్నికలు. కాని బిజేపిలో చేరినట్లే చేరి, కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కొక్కరుగా బిజేపిని వీడి, కాంగ్రెస్‌లో చేరడం వంటిది చాలా ప్రభావం చూపింది. పైగా అప్పటి వరకు అధ్యక్షుడుగా పనిచేసిన బండి సంజయ్‌ను పక్కన పెట్టి, మళ్లీ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేయడం వంటి వాటి వల్ల పార్టీకి తీరని నష్టం జరిగింది. అసలు అంతటి విపత్కర పరిస్ధితుల్లో ఎవరూ ఊహించని విధంగా 8 సీట్లు బిజేపి సాధించింది. అదే బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వుండి వుంటే ఆయనతోపాటు కనీసం మరో 25 సీట్లు వచ్చే అవకాశం వుండేది. కొత్తగా పార్టీలో చేరిన వారి మాటలు నమ్మి బండి సంజయ్‌ను దింపడమే బిజేపి చేసిన పెద్ద తప్పు. ఇప్పటికైనా పార్టీ తమ రాజకీయ స్వార్ధం కోసం, రాజకీయ పునరావాసం కోసం చేరిన వారి మాటలు కాకుండా, అసలైన బిజేపి నేతల మాటలు వినండి. కొన్ని దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్నవారిని గుర్తించండి. ఒక్క మాటలో చెప్పాలంటే బిజేపి తెలంగాణలో బలంగానే వుంది. ఎవరో వచ్చి బలపడేలా చేయాల్సిన అవసరం లేదు. అసలైన బిజేపి నాయకులను గుర్తించి టిక్కెట్లు ఇవ్వండి..బిజేపి ఎందుకు గెలవదో చూడండి. పార్లమెంటు ఎన్నికల్లోనే ఈ ప్రయోగం చేయండి. గెలుపుకు నాంది పలకండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *