మర్చిపోయిన బ్యాగు ప్రయాణికురాలికి అప్పగింత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నుంచి తుర మామిడి వెళ్లే బస్సులో ఆదివారం శోభ అనే ప్రయాణికురాలు తన బ్యాగును మర్చిపోయింది. ఈ విషయాన్ని వెంటనే కోహిర్ పోలీసులకు తెలియజేయడంతో, వారు జహీరాబాద్ డిపో మేనేజర్ స్వామితో మాట్లాడి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోహీర్ ఎస్ఐ ద్వారా ఆ బ్యాగును శోభకు అప్పగించారు.