జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

– శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఇరు వర్గాలపై కేసు నమోదు

– అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు చేయరాదు

– సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని మే 01 నుండి 31వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉన్నదని,దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు నిర్వహించారాదన్నారు. ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో పోలీస్ వారి అనుమతులు లేకుండా ధర్నా చేసి పట్టణ కేంద్రంలో శాంతి భద్రతలకు,ప్రజా రవాణాకు విఘాతం కలిగించిన ఇరు వర్గాలపై సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసులు(క్రైం నంబర్ లు 270/2026,271/2026) నమోదు చేయడం జరిగిందని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు, అసత్య సమాచారాన్ని ప్రచారం చేసి జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్‌లను కూడా బాధ్యులుగా పరిగణిస్తామని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఈసందర్భంగా సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version