
రుద్రంగి సబ్ ఇన్స్పెక్టర్
రుద్రంగి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో త్వరలో అన్ని ఇంటర్మీడియట్, టెన్త్, డిగ్రీ వార్షిక పరీక్షలు మొదలు అవుతున్న నేపద్యంలో, విద్యార్థులకు ఇబ్బంది కల్గించే విధంగా మైక్ లలో శబ్దాలు చేస్తే ,డీ జే లు పెట్టి శబ్ద కాలుష్యం చేశినా కఠిన చర్యలు తీసుకొనబడును , ఇంటర్మీడియట్ పరీక్షలు రేపటి నుండి అనగా తేదీ 28.02.2024 నుండి ప్రారంభం అవుతున్నాయి, విద్యార్థులు రాత్రి, పగలు చదువులో నిమగ్నం అయి ఉంటారు, అన్ని మతాల సంబందించిన ప్రార్థన మందిరాలలో మైక్ లలో శబ్దాలు పెడితే పిల్లల చదువుకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. పరీక్షలు ముగిసే వరకు లౌడ్ స్పీకర్లు లో శబ్దాలు చెయ్యకూడదు, ఎవరైనా శబ్దకాలుష్యం చేసి విద్యార్థులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తిస్తే వారి పైన కఠిన చర్యలు తీస్కొబడును. అలాగే 144 సెక్షన్ అమలు లో ఉంటుంది , పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి లో అనవసరంగా ఎవరు ఉండకూడదు, పరీక్ష సెంటర్ కు దగ్గరలో జిరాక్స్ సెంటర్ లు తెరువరాదు. విద్యార్థులు సకాలంలో పరీక్ష సెంటర్ కు చేరుకోవాలి.