
డాక్టర్ వెంకటనారాయణ
పరకాల నేటిధాత్రి
రానున్న వర్షాకాలం దృష్ట్యా హోటల్లో కిచెన్,పరిసరాల పరిశుభ్రంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి డాక్టర్ వెంకటనారాయణ అన్నారు.మంగళవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు తో కలిసి పరకాల మండల పరిధిలోని కామారెడ్డి పల్లి లోని లలితా రెస్టారెంట్ లో కిచెన్, స్టొర్ రూం,వాష్ ఏరియా మరియు పరిసరాలు పరిశీలించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సరుకులు కూడా తేదీ దాటిన తర్వాత వాడరాదని,గోలించడానికి ఒకసారి వాడిన నూనె తర్వాత మళ్లీ వాడకూడదని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్,పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.