వీఆర్వో లను తిరిగి రెవెన్యూ శాఖకే కేటాయించాలి
_@ఉపముఖ్యమంత్రి కి రెవెన్యూ అధికారుల విన్నపం
నేటిధాత్రి, వరంగల్
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలని, వీఆర్వోలను తిరిగి రెవెన్యూ శాఖకే కేటాయించాలని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, వరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, అసోసియేట్ ప్రెసిడెంట్ నాగేశ్వర్ రావు, ఫణి కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విక్రమ్ కుమార్ లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం నాడు వరంగల్ లో జరుగుతున్న రైతు భరోసా కార్యక్రమానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసిన తహసీల్దార్లు రద్దు చేసిన వీఆర్వో వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని, వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ లుగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి రెవెన్యూ శాఖకు వీఆర్వో లుగా నియమించి, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు. దీనికి ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు ఫణికుమార్, ఇతర రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.