రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…

jobs

రోడ్ల వెంట కొనుగోలు ఆపాలి…? మార్కెట్ గేట్ తాళాలు తెరవాలి…?

ఉపాధి కోల్పోతున్న మార్కెట్ హమాలి కూలీలు దడువాయిలు

ఈ నామ్ చేయకుండా… రైతుల సొమ్ము కాజేస్తున్న వ్యాపారులు

మార్కెట్లో చారాన కొలుగోళ్ళు…! రోడ్ల వెంట బారాన కొనుగోళ్లు..!

చోద్యం చూస్తున్న మార్కెట్ అధికారులు

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

 

కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఆసియా ఖండంలో భారత దేశంలోనే ఎక్సలెన్స్ అవార్డు పొంది గుర్తింపు తెచ్చుకొని పేరుగాంచింది, అంటే అప్పుడున్న మార్కెట్ అధికారుల చిత్తశుద్ధి కట్టుదిట్టమైన పాలన, వ్యాపారులు మార్కెట్ యార్డులోనే కొనుగోలు చేసేలా నియమ నిబంధనలు అమలుపరి, మార్కెట్ పరిసర ప్రాంతాలలో బహిరంగంగా రోడ్ల వెంట ఎవరు కొనుగోలు చేయరాదని పటిష్టమైన కట్టుదిట్టమైన చర్యలతో మార్కెట్ను సజావుగా నడిపించేవారు.

ట్రేడింగ్ లైసెన్స్ ఉన్న వారు ఎవరైనా రోడ్ల వెంట దుకాణాల ముందు కొనుగోలు చేసి వ్యవసాయ మార్కెట్ ను అప్రతిష్ట పాలు చేసే వారిపట్ల గతంలో కఠినంగా వ్యవహరించి నోటీసులు జారీ చేసిన సందర్భాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్ అధికారులు నియవ నిబంధనలు చేపట్టి రైతుల ధాన్యాన్ని మార్కెట్లోనే విక్రయించుకునేలా రైతులకు ఎలాంటి మోసాలు జరగకుండా అలాగే మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా మార్కెట్ యార్డులో పనిచేసేటువంటి హమాలి కూలీ కార్మికులకు మరియు దడువాయిలకు మంచి ఉపాధి లభించేదని పలువురు హమాలి కూలి దడువాయిలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

కొంతమంది వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టం వచ్చిన కాడికి రైతులను మోసం చేస్తూ దండుకుంటున్నారని పలువురు రైతులు విమర్శిస్తున్నారు.

మార్కెట్ పరిసర ప్రాంతాలలో కొనుగోలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి కొంతమంది వ్యాపారులు వే బ్రిడ్జి కాంటాలు నిర్వహిస్తూ వే బ్రిడ్జ్ కంటాలలో తేడాలు ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్న అవేవి పట్టించుకోకుండా ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తూ వే బ్రిడ్జి కాంటా నిర్వహించిన తర్వాత రైతుల ధాన్యం నుండి 30 నుంచి 40 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధిస్తూ ఇష్టం వచ్చిన రేట్లు పెడుతూ రైతులను నిండా ఉంచుతున్నారని ఈ నామ్ చేయకుండా మార్కెట్ ఆదాయాన్ని గండి పెడుతున్నారని పలువురు రైతులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

ఇటు రైతులనే కాకుండా హమాలి కూలీలను మరియు దడువాయిలకు రావాల్సిన సొమ్ము ఇవ్వకుండా మోసం చేస్తున్నారని, హమాలీ కూలి రేట్లు చెబుతూ రైతుకు ఇచ్చే లెక్కల్లో చూపుతూ రైతుకు కోత విధిస్తూ ఆ సొమ్మని వ్యాపారి జేబులోనే వేసుకుంటున్నాడని ఇది చాలా దారుణమని పలువురు భావిస్తున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా రోడ్ల వెంట వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే మార్కెట్ అధికారులు పట్టించుకోకపోవడం వెనక ఏదో మతాలాబ్ ఉందని గుసగుసలాడుకుంటున్నారు.

ఈ మొక్కజొన్న సీజన్లో మార్కెట్ యార్డ్ మొత్తం కాలు పెట్టే సందు లేకుండా మొక్కజొన్న రాశులతో కలకలాడుతూ కనిపిస్తూ ఉండేది, నేడు మార్కెట్ యార్డు మొత్తం ఎటు చూసినా మొక్కజొన్న రాశులు లేవు వ్యవసాయ మార్కెట్ యాడ్ మొత్తం ఖాళీగా కనిపిస్తుందంటే దీనికి అధికారులే కారణమని రైతులు దుయ్యబడుతున్నారు.

మార్కెట్ గేట్లకు తాళాలు వేసే సమయపాలన లేదా రైతులకు మార్కెట్లో అమ్ముకునే హక్కు లేనట్టు ఇలా గేట్లకు తాళాలు వేయడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన వ్యాపారస్తులు మా తప్పేం లేనట్టు కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లతో సహా ట్రాలీల వరకు డబ్బు ఆశ చూపి ట్రేడింగ్ దుకాణాల ముందుకు రైతుల ధాన్యాన్ని రప్పించుకునేలా వ్యూహాలు మొదలు పెడుతున్నారని పలువురు రైతులు అంటున్నారు.

ఇటు మార్కెట్ ఆదాయానికి గండి పెడుతూ మార్కెట్ హమాలీ కూలీల దడువాయిలకు ఉపాధి లేకుండా చేస్తున్న మార్కెట్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక విమర్శలు వెళ్లవెత్తుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు.

రైతులు ధాన్యాన్ని మార్కెట్లో పోసుకోకుండా చుట్టూ ఉన్న గేట్లకు తాళాలు వేసి ఉండడంతో రైతులు అయోమయానికి గురై దిక్కులేని స్థితిలో ఇలా రోడ్ల వెంట అమ్ముకొని నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు మండిపడుతున్నారు.

వ్యాపారులు మార్కెట్ యార్డులో 25% కొనుగోలు చేసి బహిరంగంగా వారి ఇష్టం వచ్చిన రేటు విధిస్తూ తరుగు పేరుతో 30 నుంచి 50 కేజీల వరకు ధాన్యంలో కోత విధిస్తూ బజారులో 75% కొనుగోలు చేస్తూ రైతులను మోసాలకు గురి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి, కానీ మార్కెట్ అధికారులు మాత్రం వ్యాపారుల నుండి మార్కెట్ ఫీజు చెల్లిస్తున్నారు అని చెప్తున్నారు తప్ప మరి రైతుల పక్షాన మార్కెట్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని రైతులు మోసాలకు గురికాకుండా చూడాల్సిన అధికారులే మాకు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తుంటే ఇక మార్కెట్ ఎందుకు అని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఇలా ఎవరికి వారు రైతును దోచుకోవాలని చూసేవాళ్ళు ఉన్నంతకాలం రైతు రాజు కాలేడని దీనికి కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అధికారులే నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.

ఇదే సందర్భంగా పలు హమాలి కూలి కార్మికుల సంఘాల నాయకులు మార్కెట్ కార్యాలయం ముందు వ్యాపారులు దుకాణాల ముందు రోడ్ల వెంట కొనుగోలు చేయరాదని అనే నినాదంతో కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మార్కెట్ అధికారులలో ఏమాత్రం వ్యవసాయ మార్కెట్ పట్ల చిత్తశుద్ధి లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా వ్యవసాయ మార్కెట్ అధికారులు మార్కెట్ సమయపాలన పాటిస్తూ మార్కెట్ గేట్లు తెరిచి ఉంచాలని అప్పుడే రైతుల యొక్క దాన్యం సరుకులకు గిట్టుబాటు ధర లభించి తూకాలలో మోసాలు జరగకుండా రైతుకు న్యాయం జరుగుతుందని ఇకనైనా మార్కెట్ అధికారులు రైతుల పక్షాన అలాగే మార్కెట్ ని నమ్ముకుని బ్రతుకుతున్న వేలాదిమంది కార్మికుల ఉపాధి కోల్పోకుండా నిలబడి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు చేపట్టాలని పలువురు హమాలి, కూలి దడువాయి కార్మికుల సంఘం నాయకులు రైతులు రైతు సంఘం నాయకులు మార్కెట్ అధికారులను మార్కెట్ పాలకమండలిని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!