
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున అంబేద్కర్ భవనం లో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన పుల్ల మల్లయ్య కు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సన్మానించడం జరిగింది, ఈకార్యక్రమంలో జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నె యుగేందర్ మాట్లాడుతూ పుల్ల మల్లయ్య చిట్యాల అంబేద్కర్ సంఘంలో గ్రామస్థాయి నుంచి పనిచేస్తూ.. మండల, జిల్లా, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేస్తూ
అంబేద్కర్ యువజన సంఘం బలోపేతానికి కృషి చేస్తూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాలను చైతన్య పరుస్తూ ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి అని అన్నారు, తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైనందున శుభాకాంక్షలు తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో జిల్లా సంస్క్రత కార్యాదర్శి జన్నే యుగేందర్. జిల్లా కార్యదర్శి గుర్రపు రాజేందర్ సి పి ఐ జిల్లా కార్యాలర్శి మారపెల్లి మల్లేష్ మండలద్యక్షుడు బొడ్డు ప్రభాకర్. మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్. గుర్రపు రాజమొగిలి గురుకుంట్ల కిరణ్ గుర్రం తిరుపతి కట్కూరి రాజేందర్ మ్యాదరి సునిల్ గుర్రం శంకర్ సరిగొమ్ముల రాజు కట్కూరి రాజు తదితరులు పాల్గోన్నారు.