
బ్యానర్లపై ఫోటో పెట్టకుండా అవమానపరిచిన స్థానిక నాయకులు
స్థానిక నాయకుల తీరుపై గుస్సా
సమావేశంలో పాల్గొన కుండానే తిరిగి వెళ్లిపోయిన బాలత్రిపుర సుందరి
సమావేశానికి కార్యకర్తలను తరలించడంలోనూ నిర్లక్ష్యం
పెద్ద ఎత్తున పాలుపంచుకొనని పార్టీ నాయకులు, కార్యకర్తలు
తూతూ మంత్రంగా సమావేశం నిర్వహణ
ఎన్నికలవేళ స్థానిక నాయకుల తీరుపై
పార్టీ అధిష్టానం ఆగ్రహం
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాలా త్రిపుర సుందరికి అవమానం జరిగింది. సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆమె తన ఫోటోలు బ్యానర్లలో కనిపించక పోవడంతో సమావేశంలో పాల్గొనకుండానే తిరిగి వెళ్ళిపోయింది. పార్టీ
స్థానిక నాయకులు ఆమె ఫోటోలు బ్యానర్లలో ఉంచకపోవడంతో తీవ్ర మనస్థాపానికి లోనైనా బాలా త్రిపుర సుందరి వారి తీరును నిరసిస్తూ వారిపై గుస్సా వ్యక్తం సమావేశానికి మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో ఆ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జడ్చర్ల నియోజకవర్గం ఇన్చార్జి
ఆర్ బాలా త్రిపుర సుందరి సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాటు చేసిన బ్యానర్ లో ఫోటో లేదని ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయారు. జడ్చర్ల నియోజకవర్గంలో చివరి స్థానంలో ఉన్న బిజెపిని ఆమె భుజాలపై వేసుకొని బిజెపి అంటే ఏమిటో ఆమె నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి తెలియజేసి, ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ కోసం పని చేయించారు. నియోజకవర్గంలోని గ్రామాలలో ఆమె సొంత డబ్బులతో పార్టీ కోసం
ఎన్నో కార్యక్రమాలు నిర్వహింపజేశారు. ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో బిజెపి ఈ స్థానానికి చేరుకుందంటే బాలా
త్రిపుర సుందరినే
కారణమని కొందరు కార్యకర్తలు బాహాటంగా. చెప్పుకుంటారు. బ్యానర్లో ఆమె ఫోటో వేయకుండా ఆమెను అవమానపరిచారని అందుకు అజయ్ ఘటిక ప్రబారి తాను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడమే కారణమని భావిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన తాను చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహరిస్తున్నారని అందువల్లే బాలా త్రిపుర సుందరి లాంటి సౌమ్యరాలు మనసు నొప్పించుకునే పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ అభిమానులు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. శాంత కుమార్ అభిమానులను ఈ విషయమై విచారించాగా, గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్న తాము శాంత కుమార్ అభిమానులమని, పార్టీ టికెట్ తమ నాయకుడికి రాకున్నా ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా నిలిచిన డీకే అరుణకు అండగా నిలిచి ఆమె గెలుపు కోసం కృషి చేయాలని తాము భావిస్తున్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం ఇదిలా ఉండగా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలను తరలించడంలోనూ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడంలోనూ స్థానిక నాయకత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కొట్టొచ్చినట్లుగా తూతూ మంత్రంగా పార్టీ నాయకులు కార్యక్రమాన్ని నిర్వహించి సమావేశం అయిందనిపించారు దానివల్ల పార్టీ ఎన్నికల ప్రచారానికి పార్టీ ఓటు బ్యాంక్ పెంపుకు ఎలాంటి ఉపయోగం చేకూరక పోవచ్చు.మహబూబ్ నగర్ జిల్లాలో గెలుపు దిశలో
ఉన్న బీజేపీ పార్టీ నియోజకవర్గాలలోని
బడా నాయకులను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడితే పార్టీకి ముప్పే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను దూరంగా ఉంచడం వల్ల అభ్యర్థి గెలుపు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఎన్నికలు మరో నెల రోజులు ఉన్నందున పార్టీ అధిష్టానం ఇప్పటికైనా స్థానిక నాయకులలో విభేదాలు తొలగించి వారు సమైక్యంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసేందుకు కార్యోన్ముఖులను చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.