మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్ర రెడ్డి
నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం పురపాలక సంఘం పరిధిలోని కాలనీలో నందు మాన్ హోల్స్ ఓవర్ ఫ్లో అయిన చోట డ్రైనేజీ క్లీనింగ్ చేయుటకు గాను సెక్షన్ కమ్ జెట్టింగ్ మెషిను (మ్యాన్ హోల్ క్లీనింగ్) చేయడం కోసం రూ.39.89 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ కూడా మున్సిపల్ మ్యాన్ హోల్స్ ఓవర్ ఫ్లో అయినా కూడా 9640010053 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వగలరని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి.రాజేందర్ కుమార్ ,వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్,కౌన్సిలర్లు , కో ఆప్షన్ సభ్యులు ,మున్సిపల్ మేనేజర్ చంద్రశేఖర్ , సానిటరీ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి మరియు ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.