శ్రీవారి చెంత సముద్ర హోరు.. ఆ రహస్య గ్రామంలో ఏం జరుగుతోంది?

చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో శ్రీవారి ఆలయం. ఈ రమణీయ దృశ్యాన్ని చూసేందుకు ఎన్ని కనులైనా సరిపోవు కదూ. ఆధ్యాత్మికంగానే కాకుండా, పర్యటక స్థలిగా కూడా పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే, మరెన్నో రహస్యాలు సైతం దాగి ఉన్నాయి.తిరుమల శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో ఉంటుందట. అయితే పూజారులు ఎన్ని సార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అలాగే సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తుంటారు. అయితే, శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏమిటంటే ఆ పూలు.. తిరుపతికి దాదాపు 20 కిమీల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుతాయని చెబుతుంటారు. అలాగే శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామి వారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే అది చాలా స్పష్టంగా వినిపిస్తుందట. ఇక మరో విషయం ఏంటంటే.. సాధారణంగా శ్రీవారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు మనందరికీ కనిపిస్తుంది. కానీ, నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు ఒక మూలలో ఉంటారు.. సాధారణంగా పచ్చ కర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలువారుతుంది. అయితే, శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా.. చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం. ఈ విగ్రహం దాదాపు 110 డిగ్రీల పారీన్హీట్ ఉంటుందట. అయితే, ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వల్ల ఆ ప్రభావం కనిపించడం లేదు. ప్రతి విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలు తొలగిస్తారు. ఈ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *