
అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణం
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
వీణవంక ,(కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి: వీణవంక మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… శ్రీరామచంద్రుడు ప్రజలకు మార్గదర్శడని అన్నారు రామాయణం ద్వారా ప్రజలకు ఎన్నో పితా బోధనలు చేశారని అన్నారు మానవుడు నడవడిక ఎలా ఉండాలో రామాయణ పారాయణం చేస్తే తెలుస్తుందని అన్నారు శ్రీరాముని కృప పక్షాలతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం భక్తులు ఎమ్మెల్యే వెంటా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఆలయం నుండి బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ భానుచందర్, గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లపల్లి మహేష్ గౌడ్, హోరం మధు, శ్రీరామ భక్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.