భద్రాచలం నేటి ధాత్రి
పేదబిడ్డకు పెద్దన్నగా ముందుకొచ్చి వైద్య సహాయం అందించిన డా. కృష్ణ చైతన్య స్వామి…….
పరమలించిన మానవత్వం మంటల్లో కాలి గాయాల పాలైన మూగ బిడ్డకు అండగా నిలిచిన నృసింహ సేవా వాహిని……
ఉభయతెలుగు రాష్ట్రాలలో ఆపద అంటే వినిపించే స్వరం నృసింహ సేవా వాహిని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బక్క చింతలపల్లి గ్రామానికి చెందిన పసుల. రజిత (11) సంవత్సరాల ఈ పాప పుట్టుమూగ,మాటలు రావు రాష్ట్రo లో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది.ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉంటున్న ఈ తరుణం లో ఆ చలి మంటలే ఓ పసిబిడ్డను గాయాల పాలు చేసింది.రెండు రోజుల క్రితం చిన్నారి రజిత కుటుంబం ఇంటిముందు చలిమంట వేశారు.కొంత సమయం తరువాత పాపను మంట దగ్గరలో కూర్చోబెట్టి తల్లి ఇంట్లో పని చేసుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా మంటలు ఎగసి పాప డ్రెస్ ను అంటుకున్నాయి. మంటల్లో కాలిపోతున్నానని , కనీసం గట్టిగా అరవడానికి కూడా, మాటలు రాని ఆ పసిబిడ్డ బాధను మౌనంగా భరించింది. మంటలతో ఇంటి గుమ్మం లోకి వెళ్లే లోగా సగానికి పైగా శరీరమంతా కాలిపోయింది.మాటలు రాని ఆ బిడ్డ పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు,కనీసం ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చూపించే స్థితి ఆ తల్లిదండ్రుల దగ్గర లేదు.చేతిలో చిల్లిగవ్వలేక రెక్కాడితే డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు రోదన తమ బిడ్డ కొరకై పడుతున్న మనోవేదన మన్యంలో ఎన్నో సేవలు చేస్తున్న మన నృసింహ సేవా వాహిని దృష్టికి తీసుకువచ్చారు ఓ భక్తుడు.నిజంగా ఏ దేవుడు వారి గోసను చూసి చలించాడో ఏమో, విషయం తెలిసిన వెంటనే మానవత్వo పరిమిలించిన మహర్షిలా సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి స్పందించి తక్షణ సహాయంగా సంస్థ సభ్యుల సహకారం తో చిన్నారికి 21,000/- (ఇరవై ఒక్క వేల రూపాయలు )వైద్య ఖర్చులకు అందించి ఆ ఇంటికి పెద్ద కొడుకుగా భుజం కాశాడు ఈ గురుదేవులు.అలానే ఇంకా అవకాశం ఉన్నంత వరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారికి భరోసా కల్పించడం జరిగినది.ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతూ ఆపద అంటే కన్న తండ్రి లా సహకారం అందిస్తున్న డా. కృష్ణ చైతన్య స్వామి చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు మన్యం వాసులు. నిజంగా ఇటువంటి మహాత్ములు, మనముందు నడయాడుతూ సేవలoదించడం మన్యం బిడ్డలకు అందిన గొప్పవరం అవకాశం ఉంటే స్వామి చేస్తున్న సేవల్లో భాగస్వామ్యులమవుదాం మన వంతు సమాజం కొరకు పాటు పడదాం.