రాష్ట్ర అనుముల నుండి తరలివచ్చిన పెయింటింగ్ ఆర్టిస్టులు

ఆర్టిస్టులకు న్యాయం జరిగేందుకు తెలంగాణ
ఆర్ట్ సొసైటీ:విద్య వెంకట్

కూకట్పల్లి డిసెంబర్ 27 నేటి ధాత్రి ఇంచార్జ్

చిత్రకారుడు అంటేనే చరిత్రకారుడు అని చెప్పవచ్చు.వారి కుంచె నుంచి అద్భుతాలు జాలువారుతాయి.. సజీవంగా మనం చూడలేకపోయిన విషయాలను మన కళ్ళముందుకు తీసుకుని వస్తారు వారు. కడుపు ఆకలితోమలమాలలాడుతున్నా.గుండెల్లో బాధ రగులుతున్నా..
తమ రక్తాన్నే రంగుగా మార్చుకుని అందమైన చిత్రాలను, అక్షరాలను సృష్టిస్తారు.అలాంటి మరుపురాని కళాకారులకు ఏదైనా చేయాలనే తాపత్రయంతో తెలంగాణ ఆర్ సొసైటీ బుధవారం ఆవిర్భ విం చింది.తెలంగాణ చిత్రకారు లందరినీ ఒక వేదికపైకి తీసుకుని వచ్చి వారి సామాజిక, ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరుచుటకు కృత నిశ్చయం
తో ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భాష్యం యదు మోహన్,విద్య వెంక ట్, డీ.వీ.రమణ తదితర ముఖ్య కళాకారులు సోమాజీగూడా ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించారు. కార్యక్ర
మానికి అధ్యక్షతవహించినసీనియర్ ఆర్టిస్టు భాష్యం యదు మోహన్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి
ఎంతో మంది చిత్రకారులు, పెయిం టింగ్ ఆర్టిస్టులు రావడం అభినంద నీయమన్నారు.ఈ సందర్భంగా
తోటి చిత్రకారుడు అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నెన్నో ఒడిదొడుకులను తట్టుకుని, తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్ రెడ్డి ని ప్రశంసిస్తూ….వారికి అందరు చిత్ర
కారుల తరఫున అభినందనలు తెలి యజేశారు. సీనియర్ ఆర్టిస్ట్ విద్య వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ఆర్ట్ సొసైటీ ఏ సంఘానికి,ఏ సంస్థ కు పోటీ కాదని ఆర్టిస్టుల సంక్షేమం కాపాడుతూ భవిష్యత్తు తరాలకు ఉత్తమ ఆర్టిస్టులను అందించే లక్ష్యం తో ప్రారంభించడం జరుగుతుంద న్నారు. తెలంగాణ ఆర్టీ సొసైటీ ద్వారా గుర్తింపు పొందిన ఆర్టిస్టు
లకు గుర్తింపు కార్డులు,హెల్త్ ఇన్సూ రెన్స్, నైపుణ్యతపెంపొందించేందుకు శిక్షణ తరగతులు, వృద్ధ ఆర్టిస్టులకు పెన్షన్, గృహ వసతి ఏర్పాటుకు కృషి చేయడం జరుగు తుందన్నా రు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు కాంట్రాక్టర్లైన బ్రోకర్ల ద్వారా కాకుండా కళా రంగానికి సంబంధిం చిన పనులు తెలంగాణ ఆర్ట్ సొసైటీ ద్వారా ఆర్టిస్టులకే అందే విధంగా కృషి చేయడం జరుగుతుంద న్నా రు. ఆర్టిస్టుల పిల్లల చదువులకు సహకారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశానికి
సభా పరిచయం చేసిన సీనియర్ ఆర్టిస్ట్ డివి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని చిత్ర కళాకారులందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకే తెలంగాణ ఆర్ట్ సొసైటీ ప్రధాన ఉద్దేశం అన్నారు. పెయింటింగ్ ఆర్టిస్టులు అందరూ ఈ తెలంగాణ ఆర్ట్ సొసైటీలో చేరితే వారి భవి ష్యత్తు బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఆర్టిస్ట్ నాగేందర్, కాసుల పద్మావతి పడిగే సత్యం,నంద్యాల (పెయింటర్) శ్రీనివాస్, తానాజీ, యాకయ్య, మాతంగి మల్లేష్, ఇబ్రహీంలు ప్రసంగించారు.కార్య క్రమంలో ఆర్టిస్టులు కే.అశోక్,రా మకృష్ణ,బాసిత్,శివాజీ బండారి నరేష్ బండారి నరేష్,రాము తది తరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!