నేటీదాత్రీ (మేడిపల్లి):
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిదిలో దోమల నియంత్రణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగర పరిధిలో ప్రతి డివిజన్లో 2 ఎలక్ట్రిక్ స్ప్రే మిషన్ల ద్వారా అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అన్ని గృహలకు డోర్ టూ డోర్ దోమలు మందులు పిచికారి కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ….ఇంటి లోపల గోడలపై పిచికారీ చేసే దోమల మందు సింజెంట వారి ఐకాన్ (Syngenta – ICON) క్రిమి సంహారక మందు వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవని, ఈ మందు ద్వారా ఇంట్లోకి దోమలు రాకుండా నివారించ వచ్చని, మందు పిచికారి చేసిన ప్రదేశాలలో నీటితో కడగటం వంటివి చేయడం ద్వారా మందు ప్రభావం తగ్గుతుందని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత దోమల నివారణకు దోహదపడుతుందని అన్నారు.
ప్రజలు గృహాలలో ఉన్న నీటి నిల్వలను అంటే పూల కుండీలు నీటి పాత్రలు, చెట్ల ఆకులు, కిటికీల సన్‌షేడ్‌లు, టైర్లు, ఇతర డంప్ చేయబడిన కంటైనర్లు & మెటీరియల్స్, స్తబ్దుగా ఉన్న డ్రైన్ పాయింట్లు, కూలర్లులలో నిల్వ ఉన్న నీళ్లు తీసివేయడంతో పాటు నిత్యం శుభ్రంగా ఉంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.