
Spot admissions for remaining seats in ideal schools
ఆదర్శ పాఠశాలల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలోని 10 ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. విద్యార్థులు నేరుగా పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులను సంప్రదించి చేరాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.