మందమర్రి, నేటిధాత్రి:-
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని సిఈఆర్ క్లబ్ లో సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు మంగళవారం ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా సేవా అధ్యక్షురాలు ఏ సవిత మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై, ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అనంతరం పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబ్ ఇన్ బ్లాస్ట్, మ్యూజికల్ బాల్, ఉపన్యాస పోటీలు నిర్వహించగా, పోటీలలో ఏరియాలోని సుమారు 200 మంది మహిళలు, సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు సవిత మనోహర్ మాట్లాడుతూ, ఈపోటీలో గెలుపొందిన మహిళలకు అంతర్జాతీయ మార్చి 8న మహిళా దినోత్సవం వేడుకలో బహుమతి ప్రధానోత్సవం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కమ్యూనికేషన్ సెల్,సేవా సమితి కోఆర్డినేటింగ్ అధికారి, డివైపిఎం ఎండి అసిఫ్, గనుల, విభాగాల మహిళా ఉద్యోగులు, సేవా సభ్యులు, ఫ్యాకల్టీ సిబ్బంది, మహిళలు, సేవా సమితి, కమ్యూనికేషన్ సెల్, గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.