
రేగొండ, నేటి ధాత్రి:
మండలంలోని సుప్రసిద్ధ దేవాలయం కొడవటంచ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానము నందు శుక్రవారం రథ సప్తమి పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉదయం 9:00 గంటలకు సూర్య వాహనసేవ తదుపరి ఆరగింపు,తీర్ధ ప్రసాదము వితరణ జరిగాయి.ఈ రోజుకు ప్రత్యేక విశిష్టత ఉండడంతో మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరై లక్ష్మీనృసింహస్వామి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి బి. శ్రీనివాస్, ఆలయ చైర్మన్ మాదాడి అనిత – కరుణాకర్ రెడ్డి, ధర్మకర్తలు గండి తిరుపతి, కనుకుంట్ల దేవేందర్, గైని కుమారస్వామి, గ్రామ పెద్దలు ముల్కనూరి బిక్షపతి, సాంబయ్య అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు.