నల్లబెల్లి , నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని కీర్తిశేషులు కొండ జీడికంటి రామయ్య దాతల సహకారంతో నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రామయ్య కుటుంబ సభ్యులు దేవాలయ శాశ్వత ధర్మకర్తలు గురువారం పూర్ణకుంభంతో ప్రత్యేక పూజలు నిర్వహించి మూల విరాట్ స్వామివార్లకు పట్టు వస్త్రాలు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ మండల మరియు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని సీతారామచంద్రస్వామిని కోరినట్లు వారు తెలిపారు అలాగే 22వ తేదీన అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆలయంలో జరిగే పలుకార్యక్రమాలలో భక్తులు భక్తిశ్రద్ధలతో అధిక పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పూజ కార్యక్రమంలో కొండా లక్ష్మణస్వామి, కొండ భాస్కర స్వామి, కొండ కృష్ణ స్వామి. దంపతులతో పాటు కీర్తిశేషులు కొండ బాను మూర్తి కుటుంబ సభ్యులు స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.