సంక్షేమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కాలేజీని మంగళవారం రోజున మండల స్పెషల్ ఆఫీసర్ డిసిఒ పరిశీలించారు, అనంతరం పాఠశాల కళాశాలలోని రికార్డులను వంట గదిని డైనింగ్ హాలును స్టోర్ రూమ్ను ప్లేగ్రౌండ్ పరిశీలించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అభినందించారు అలాగే విద్యార్థుల యొక్క విద్య నైపుణ్యాలను పరిశీలించి వారితో మాట్లాడడం జరిగింది మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జయ శ్రీ ,పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.