జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య వారోత్సవంలో భాగంగా గురువారం రోజున గ్రామ ప్రత్యేక అధికారి ఎమ్మార్వో రమేష్ , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ,తాజా మాజీ సర్పంచ్ నామాల సత్యవతి, తిరుపతి , ఎంపీటీసీ పెద్దల బాపు ,అంగన్వాడీ టీచర్స్ ,సి ఏ లు, ఆశ వర్కర్లు ఈజీఎస్ సిబ్బంది పాల్గొని నర్సరీలోని మొక్కలకు గుంతలు చేపించడం జరిగింది. స్మశాన వాటికలోని చెట్లకు నీళ్లు పోయడం మరియు డ్రై డే సందర్భంగా నిల్వ ఉన్న నీటిని క్లీన్ చేసుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది. గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిచ్చి మొక్కలను తొలగించాలని చెట్లు నాటాలని ప్రత్యేక అధికారి గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. నర్సరీలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని సూచించారు.