
SP Sudhir Ramnath Kekan
కానిస్టేబుల్ అలీమ్ కు మహబూబాబాద్ ఎస్పీ అభినందనలు..
రైతన్నల కోసం లారీ డ్రైవర్ గా మారిన కానిస్టేబుల్ అలిమ్ ను శాలువాతో సన్మానించి అభినందించిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకాన్…
కేసముద్రం/ నేటి ధాత్రి
గురువారం యూరియా కోసం రైతులు కల్వలలో వేచిచూస్తున్నారు..,
కేసముద్రం కు యూరియా లోడ్ తో వచ్చిన లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీ తోలే పరిస్థితిలో లేడు…!వెంటనే కేసముద్రం పోలీస్ స్టేషన్ కు చెందిన బ్లూకోట్ ఆపీసర్, కానిస్టేబుల్ అలీమ్ పై అధికారులకు సమాచారం ఇచ్చి, తానే లారీడ్రైవర్ గా మారిపోయి కేసముద్రం నుండి, కల్వలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ కు సకాలంలో యూరియాలోడ్ ను చేర్చాడు. ఈ విషయం తెలుసుకున్న రైతులు మరియు అధికారులు కానిస్టేబుల్ అలీమ్ అభినందించారు.
సకాలంలో యూరియా రైతులకు అందించాలనే మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పడుతున్న తపన, కష్టం .. తనను కదిలించిందని, తన బాధ్యతగా బావించి అధికారుల అనుమతితో ఆ..పని చేసానని కానిస్టేబుల్ అలీమ్ తెలిపారు.
ఈ..రోజు ఉదయం యదావిధిగా యూరియా పంపిణీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అలీమ్ ను కల్వల గ్రామానికి వచ్చిన ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ గమనించి, అతనిని ప్రత్యేకంగా అభినందించారు. రైతులకోసం సమయస్ఫూర్తితో స్పందించిన తీరును ప్రశంసిస్తూ శాలువా కప్పి సత్కరించారు..
జిల్లా పోలీస్ బాస్ గా అనేక రకాల పనుల వత్తిడిలో ఉన్నప్పటికీ…, తన సిబ్బంది పనితీరును గుర్తించడం, వారిని ప్రశంసించి, ప్రోత్సహించడమే కాక, స్వయంగా తానే కానిస్టేబుల్ ను సత్కరించి అభినందించడం ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ పెద్దమనుసు కు ఒక ఉదాహరణ అని అక్కడ ఉన్న రైతులు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రశంసించారు. ఉన్నతాధికారులు తీసకునే ఇలాంటి నిర్ణయాలు సిబ్బందిలో మరింత ఉత్సాహాన్ని, అంకితభావంతో పనిచేయాలనే ఆలోచనను కలిగిస్తాయని పలువురు ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ కు కృతజ్ఞతలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ వెంట ఎస్సై కరుణాకర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.