అమరవాది గ్రామానికి త్వరలోనే రోడ్డు వేయిస్తాం

గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని మునిసిపాలిటీ…

అక్టోబర్ నుండి అందరికీ ఫ్యామిలీ కార్డులు అందిస్తాం…

చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ అమరవాది లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. గ్రామంలోని సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.రోడ్లు,డ్రైనేజీ,స్మశాన వాటిక,వెటర్నరీ హాస్పిటల్,బస్సు సౌకర్యం, స్మశాన వాటిక , బోర్ కావాలని ఎమ్మెల్యే తో గ్రామస్తులు తమ సమస్యలను చెప్పుకున్నారు.గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే తో తమ బాధను వెల్లబుచుకున్నారు.ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ….గత 20 ఏళ్ల క్రింద వేసిన రోడ్డు ఇప్పటివరకు ఉందని, అది గుంతల మయంగా మారిందని, గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి డీ ఎం ఎఫ్ టీ ఫండ్స్ నుంచి రోడ్డు వేయాలని ప్రపోజల్స్ పంపుతున్నామని, త్వరలో రోడ్డు నిర్మాణం చేపడుతామని గ్రామస్థులకు మాట ఇచ్చామని తెలిపారు. గోపాలమిత్ర వెటర్నటి హాస్పిటల్ పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదని, వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా పూర్తి చేస్తామని చెప్పారు .కొత్త డిజిటల్ టెక్నాలజీతో 2 అక్టోబర్ నుంచి అందరికీ ఫ్యామిలీ కార్డు అందిస్తామని, అర్హులైన అందరికీ ఇబ్బందులు తొలగిపోతాయని,జనవరి నుంచి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తాం అని అన్నారు.గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్న మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్ తో పాటు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందిని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గోపతి రాజయ్య, నాయకులు అబ్దుల్ అజీజ్, ఓడ్నాల శ్రీనివాస్, గంగారపు సత్యపాల్, కాంగ్రెస్ శ్రేణులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!