నేటిధాత్రి, వరంగల్ తూర్పు
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా, వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మడిపెల్లి కృష్ణ గౌడ్ వరంగల్ కొత్తవాడ జంక్షన్లో ఉన్న లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం అందరికీ ఆదర్శమని వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించారని పేర్కొన్నారు. తొలి, మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర ఎంతో కీలకమని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.