కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నా కాంగ్రెస్ శ్రేణులు
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79 వ జన్మదిన వేడుకలు సోమవారం రోజున కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు,తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆరు గ్యారంటీల హామీ అమలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు.అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల మండల అధ్యక్షుడు కటుక్కురి దేవేందర్ రెడ్డి,నడికూడా మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్,మాజీ జడ్పీటీసీ పాడి కల్పనదేవి,మాజీ ఎంపీపీ ఒంటెరు రామ్మూర్తి,కౌన్సిలర్లు మడికొండ సంపత్,నలెల్ల జ్యోతి అనిల్ కుమార్, మార్క ఉమారఘుపతి,మీడియా ఇంచార్జీ దార్న.వేణుగోపాల్, సమన్వయ కమిటీ సభ్యులు చిన్నల గోనాదు,ఎండి రంజాన్ అలీ,మడికొండ శ్రీనివాస్,ఎండి.జాఫర్ రిజివి,మెరుగు శ్రీశైలం,చందుపట్ల రాఘవరెడ్డి, పబ్బా శ్రీనివాస్,దుబాసి వెంకటస్వామి,ఉడుత సంపత్,బొమ్మకంటి చంద్రమౌళి,బండారి కృష్ణ,గొటే రమేష్,వెల్దండ సురేష్ కుమార్,బొచ్చు శ్రీధర్,సోషల్ మీడియా ఇంచార్జీ గడ్డం శివ, బొచ్చు జెమిని,తిరుపతి రావు మరియు పరకాల మండల మహిళ కమిటీ అధ్యక్షురాలు పసుల విజయ,దామ రజని,లక్కం వసంత,కోమల తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదిన సంబరాలు
పరకాల పట్టణంలోని రాజదాని ప్రధాన కూడలిలో యూత్ కాంగ్రెస్ పరకాల మండల అధ్యక్షులు దొమ్మటి కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,పరకాల వ్యవసాయ కమిటీ ఛైర్మెన్ రాజీ రెడ్డి హాజరయ్యారు.అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లా రెడ్డి,మార్కెట్ డైరెక్టర్ లు దాసరి భిక్షపతి,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,ఎస్సీ సెల్ ఉమ్మడి మండల అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి మచ్చ సుమన్,మహమ్మద్ ఆలీ,కందుకూరి రాంప్రసాద్,బొచ్చు జెమిని,కోడేపాక ఐలయ్య,యూత్ కాంగ్రెస్ మండల నాయకులు మంద వెంకటేష్,మంద శివ,కోడెపాక సాయి,బొచ్చు రాజు,బొచ్చు వినయ్,అరుణ్,యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కోమల జెమిని ఆధ్వర్యంలో బెతెల్ ఆశ్రమంలో వేడుకలు
భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు,తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ 79వ జన్మదినం పురస్కరించుకొని హనుమకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల జెమిని ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని సి.ఎస్.ఐ బేతెల్ అనాధాశ్రమంలో,కేక్ కటింగ్ చేసి,పండ్లు,బ్రెడ్ పంపించేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ
60 ఏళ్ల గాయాలను మాన్పుతు,ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను నిజం చేస్తూ, నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మన తెలంగాణ ప్రదాత,తల్లి సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రుణపడి ఉంటారు అని,తెలుపుతూ సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణ అభివృద్ధికై పాటుపడుతున్నారని ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. మరియు యువత ఏలాంటి మత్తు పదార్థాలకు తావు ఇవ్వకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా దేశ భవిష్యత్తు కోసం ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి, చంద్రమౌళి (ఎస్సీ విభాగం అధ్యక్షులు) కాంగ్రెస్ నాయకులు మడికొండ చంగల్ రావు,బొచ్చు సంపత్,కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు బొచ్చు అనిల్,బొచ్చు రాజు,బొచ్చు నాగరాజు, జూపాక కిషన్,కోడేపాక రాకేష్, ఒంటేరు వినయ్,మడికొండ రాజు తదితరులు పాల్గొన్నారు.
1వ వార్డులో కౌన్సిలర్ సంపత్ ఆధ్వర్యంలో వేడుకలు
పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మడికొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు వార్డ్ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరిపారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,ఎన్ఎస్యుఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి డాక్టర్.మడికొండ శ్రీను,బొచ్చు భాస్కర్,పరకాల మండలం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాఘవ,యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీ సిలువేరు వెంకటేష్,మరుపట్ల మహేష్,వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.