– తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి అధ్యక్షులు బొడ్డు దేవయ్య
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సహజ వనరులను కొంతమంది బడాబాబులు తమస్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నారని తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి అధ్యక్షులు బొడ్డు దేవయ్య అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొడ్డు దేవయ్య మాట్లాడుతూ కొంతమంది తమ ఆర్థిక ప్రయోజనాల కోసం సహజ వనరులను కొల్లగొడుతున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని అన్నారు. సహజ వనరులను కొల్లగొడుతున్న వారిని అరికట్టడం కోసం ప్రజలు సంఘటితం కావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందనగిరి గోపాల్, వాసం మల్లేశం, ముస్తాబాద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, మాజీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుర్ర మల్లేశం, మంగలి చంద్రమౌళి, కడారి రాములు, నరేష్ నాయక్, గుండా థామస్, ప్రభాకర్, అజ్జు, వేణు తదితరులున్నారు.
సహజ వనరులను కొందరు కొల్లగొడుతున్నారు
