నర్సంపేట,నేటిధాత్రి :
కేంద్రంలో ఎన్డీయే కూటమి 292 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొని హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ అవుతున్న సందర్భంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని భారతీయ జనతా పార్టీ
ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్థూపం కూడలి వద్ద టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణలో రాబోయే రోజుల్లో భాజపా అధికారం చేపట్టడం ఖాయం అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ ప్రభారి అజ్మీర కృష్ణా వేణి ,నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహరాములు,జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్ గారు,మహబూబాబాద్ పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు,పట్టణ కౌన్సిలర్స్ జుర్రు రాజు యాదవ్,లునావత్ కవిత – వీరన్న,ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, యువ మోర్చ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
# భాజపాలో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు…
దుగ్గొండి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు నూతనకంటి శ్రీనివాస్ బుదవారం భాజపా మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బుసాని రమేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఈ సందర్భంగా భాజపా నియోజకవర్గ చేరికల కమిటీ చైర్మన్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.అలాగే మరో నాయకుడు లింగాల బుచ్చయ్య చేరారు.ఈ కార్యక్రమంలో దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్,నర్సంపేట రూరల్ మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, బైరి పవన్ కుమార్ యువ నాయకులు శ్రవణ్, లింగన్న, మహిళా మోర్చా నాయకురాలు సుత్రపు సరిత, హైమవతి తదితరులు పాల్గొన్నారు.