
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో బుధవారం రోజు స్నేహ ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కె.వి ప్రతాప్, డైరెక్టర్ కె.వి చిదానంద కుమారి,వడ్నాల శ్రీనివాస్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్
విద్యార్థులకు 6 సైకిళ్లు బహకరించారు.
ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఈరోజు ఏర్పాటు చేసిన జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి ఒక సివి రామన్, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం గా ఒక సైంటిస్ట్ గా ఎదగాలని అన్నారు. విద్యార్థి దశ నుండే పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆపార పరిజ్ఞానం ఉన్న ఉపాధ్యాయుల నుంచి సమాచారం సేకరించుకొని భవిష్యత్తులో రాణించాలని, విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించాలని క్రమశిక్షణ కలిగి చదవాలని ప్రభుత్వ పాఠశాలల మనుగడ బ్రతికించాలని ఉద్దేశంతో మేము సిద్ధంగా ఉన్నామని అందుకు కావలసిన వనరులను సమకూర్చేందుకు వెనకాడబోమని స్నేహ ఫౌండేషన్ చైర్మన్ తెలిపారు.
ఈ యొక్క పాఠశాలకు వివిధ దూర ప్రాంతాల నుంచి కాలినడకన వస్తున్న పాఠశాల విద్యార్థులకు 6 సైకిలను బహుమతి ఇవ్వడం జరిగింది.
పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు స్నేహ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ దుగుట జ్యోతి-పండరి, ప్రధానోపాధ్యాయుడు రాజగోపాల్, ఉపాధ్యాయులు విజయదుర్గ, కిరణ్మయి, కల్పన, శ్రీలత, సురేందర్, సిఆర్పి రాజన్న, రూం టూ రీడ్ ప్రోగ్రాం ఫెసిలిటేటర్ గీత మరియు విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.