`స్మిత సబర్వాల్ మీద చిల్లర వార్తలా!
`ఉద్యోగ నిర్వహణలో అవినీతి పదం లేని ఏకైక అధికారి
`అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం
`చిత్తశుద్ధిలో కర్తవ్యం నింపుకున్న ఆదర్శం
`ఐఏఎస్‌గా ఇప్పటి వరకు అవినీతి మరక అంటని అధికారి
`వేల కోట్ల రూపాయల తెలంగాణ అభివృద్ధి పనులను నిర్వహించారు
`డైనమిక్ ఆఫీసర్‌గా గుర్తింపు
`కారు కిరాయల కోసం ఆలోచించేంత చిన్న అధికారా?
`తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడిన అధికారి
`పదేళ్ల తెలంగాణ పరుగులో ఆమె పాత్ర ఎంతో కీలకమైనది
`తెలంగాణ ఉద్యమ కుటుంబాల కోసం కన్నీరు కార్చిన తల్లి స్మిత
`తెలంగాణ ఉద్యమ కారుల కుటుంబాలకు సత్కారం చేసిన ఏకైక అధికారి స్మిత సబర్వాల్
`తెలంగాణ అంటే ఆమెకు అంత మక్కువ
`ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌కు రావడంలో ఆమె పాత్ర గొప్పది
`తెలంగాణ ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఆమె పర్యవేక్షణలోనే
`మూడేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేసిన ఘనతలో ఆమెదే
`తెలంగాణ సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారంటే ఆమె చలవే!
`మూడేళ్లలో మంచినీరు అందించాలని ఆదేశిస్తే నిజం చేసి చూపించిన అధికారి
`తెలంగాణ సాగు రంగం కళకళలాడేలా చేశారు
`మహిళా అధికారి అయినా సిఎంవోలో 14 శాఖలు పర్యవేక్షించేవారు
`తెలంగాణ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు అహర్నిశలు పనిచేశారు
`ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క ఓటమి కూడా లేదు
`పని చేసిన ప్రతి శాఖకు వన్నె తెచ్చారు
`ప్రజలకు సేవలందించారు
హైదరాబాద్,నేటిధాత్రి:
నీతిని దహించలేరు..ఈ పదాలు అక్షరాల రాష్ట్ర టూరిజమ్ శాఖ ప్రిన్సిపల్ కమీషనర్ స్మిత సబర్వాల్‌కు అన్వయించొచ్చు. తెలంగాణ రాష్ట్రం విషయంలో ఆమె ఒక బ్రాండ్. అవినీతి మరకలు ఇంత వరకు అంటని ఒక ఉన్నతాధికారి. పైగా తెలంగాణ అంటే ఎంతో మమకారం వున్న ఐఏఎస్ అదికారి. అంతటి ఆత్మను నింపుకున్న స్మిత సబర్వాల్ మీద ఎలాగైనా అవినీతి ముద్ర వేయాలని కొందరు అనుకోవచ్చు. కాని అది సాధ్యమయ్యే పని కాదు. కింది స్దాయి ఉద్యోగులే కొందరు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతుంటే, ఇప్పటి వరకు ప్రభుత్వ సొమ్ము తిన్నట్లు ఒక్క ఆరోపణ కూడా ఆమె మీద లేదు. ఇకపై వుండకపోవచ్చు. అవినీతి అదికారుల మీద వార్తలు రాయడం ఎంత ముఖ్యమో! నీతి వంతంగా పనిచేసే స్మిత సబర్వాల్ లాంటి ఉన్నతాధికారి చేసే మంచిపనులను ప్రపంచానికి చెప్పడానికి వార్తలు రాయాలి. ఆమెను ఆదర్శంగా తీసుకొని వచ్చే తరాలు పనిచేసేలా వార్తలుండాలి. అంతే కాని లేనిపోని ఆరోపణలు సాగించే వార్తలు తెలంగాణ సమాజానికే మంచిది కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఉద్యోగ సమాజంలో నీతివంతంగా వుండడం కూడా ఇబ్బందికరమే అవుతోంది. అలాంటి వ్యవస్ధలో తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్న అధికారి స్మితా సబర్వాల్. అలాంటి అదికారి కేవలం కారు రెంటు కోసం కక్కుర్తి పడ్డట్టు ఆరోపణలు రావడం కూడా దురదృష్టకరం. నిజంగా ఇన్‌వెస్టిగేషన్ జర్నలిజం చేయాలనుకున్నప్పుడు ఆమె నిర్వహించిన శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే వెతికిపట్టుకోవాలి. అంతే కాని గాలి వార్తలు పట్టుకొని వార్తలు రాయడం వల్ల ఆమె ఇమేజ్ ఇసుమంతైనా తగ్గుతుందనుకోవడం పొరపాటు. గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో ఆమె నిర్వహించిన పాత్ర ఎంతో గొప్పది. తెలంగాణ పదేళ్లలో పరుగులు పెడుతుందంటే పాలకుల పాత్ర ఎంత వుంటుందో..అదికారుల పాత్ర కూడా అంతే వుంటుంది. అదికారులు తమ పాత్ర నిర్వహణలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవు. ఈ సంగతి కూడా జర్నలిస్టు సమాజానికి తెలిసి వుండాలి. ఆమె గత ఇరవై ఏళ్ల కాలంలో పోషించిన పాత్ర ఎంతో విలువైంది. ముఖ్యంగా గత పదేళ్లకాలంలో ఆమె సేవలు తెలంగాణ చరిత్ర వున్నంత కాలం వుంటాయి. వచ్చే ఉద్యోగ తరాలు పాఠాలుగా చెప్పుకుంటారు. నీతికి ఆమె ఎంత నిదర్శనంగా వున్నారో తెలుసుకుంటారు. అయినా ఆమె గత పదేళ్లకాలంలో సుమారు 14శాఖలను సమర్ధవంతగా నిర్వహించారు. సహజంగా ఒకటి రెండు శాఖల నిర్వహణే ఎంతో కష్టం. అలాంటిది ఆమె ఇన్ని శాఖలపై పట్టు సాధించడమంటే ఆశమాషీ కాదు. నేను ఉద్యోగం చేస్తున్నాను..అని మాత్రమే ఒక ఐఏఎస్ అధికారి అనుకుంటే ప్రభుత్వం ఏ పని చేయలేదు. అందువల్ల ఏ ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరాలన్నా ఐఏఎస్ అధికారుల పాత్ర ఎంతో కీలకం. ప్రభుత్వం ఇచ్చే హామీల అమలులో అధికారుల పాత్రపైనే వాటి అమలు ఆధారపడి వుంటుంది. మరీ ముఖ్యంగా స్మిత సబర్వాల్ లాంటి అధికారులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో ఓ పది మంది వుంటే చాలు. ఆ ప్రభుత్వం సాధించలేని లక్ష్యాలు అంటూ వుండవు. గత ప్రభుత్వంలో అందుకే ఆమెకు అంత ప్రాధాన్యత కల్పించింది. ముఖ్యంగా ఆమెలో తెలంగాణ వాసి కాదు. తెలంగాణ క్యాడర్‌కుచెందిన అధికారి కాదు. అయినా ఆమె తనలో తెలంగాణ ఆత్మను నింపుకున్నారు. ఆమె పనితీరుపై మెదక్ జిల్లాలో జరిగిన ఒక్క సంఘటన చాలు. తెలంగాణ వచ్చిన సమయంలో ఆమె మెదక్ జిల్లా కలెక్టర్‌గా వున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన తొలి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆమె ఉద్యమ కారుల కుటుంబాలను సత్కరించిన తీరు అప్పటి ప్రభుత్వాన్ని కూడా కదలించింది. అమరుల కుటుంబాలకు చెందిన తల్లులను పిలిపించి వారికి చీర సారెలు పెట్టి, వారి కన్నీటిని తూడ్చింది. ఆ తల్లులు కలెక్టర్ అనే ఆలోచన లేకుండా ఆమెను పట్టుకొని ఏడుస్తుంటే, ఆమె కూడా కన్నీటి పర్యంతమైపోయిన సందర్భం తెలంగాణ వాదుల కళ్లల్లో ఎప్పటికీ చెరిగిపోదు. అంతగా ఆమె తెలంగాన ఉద్యమ గొప్పదనాన్ని కూడా ఆమె గుండెల్లో నింపుకున్నారు. అందుకే ఆమె తెలంగాణ అభివృద్ది కోసం పదేళ్లపాటు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ఆ ఒక్క సంఘటన చూసి చలించిపోయిన అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్ ఆమెను వెంటనే సిఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. పదేళ్ల కాలంలో ఆమె చేత అనేక అభివృ ద్దిపనుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ప్రతి ఇంటికి మంచినీటిని అందించే మిషన్ భగీరథ కార్యక్రమం మూడేళ్లలో పూర్తయ్యిందంటే అందుకు ప్రధాన కారణం స్మిత సబర్వాల్. ప్రభుత్వాలకు లక్ష్యాలుంటాయి. ఆ లక్ష్యాలను తీర్చడంలో అధికారుల పాత్ర కూడా ఎంతో కీలకం. ప్రభుత్వాలు ఎంత పట్టుబట్టి తమ లక్ష్యాల సాధనకోసం అధికారులను పరుగులుపెట్టించినా కాని పనులు అనేకం వున్నాయి. కాని ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత కాలంలో మిషన్‌భగీరధ పూర్తి చేసి, తెలంగాణలో ప్రతి ఇంటింటికీ సరుక్షితమైన మంచినీరు అందించడం జరిగింది. అంటే ఆమె కృషి ఎంత గొప్పదో, ఆమె ఎంత కష్టపడితే ఆ గడువులో ఆ పధకంపూర్తయ్యిందో అర్దం చేసుకోవచ్చు. ఆమె మీద వున్న నమ్మకంతోనే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇంటింటికీ మంచినీరు అందించకపోతే ఓట్లు అడగమంటూ ఛాలెంజ్ చేశారు. స్మిత సబర్వాల్ పనితీరుకు ఈ ఒక్క విజయం చెప్పడానికి చాలు. ఇలా ఆమె సాధించిన విజయాలు అనేకం వున్నాయి. అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యత దక్కింది. ఇక కారు కిరాయి గురించి మాట్లాడాల్సి వస్తే, తెలంగాణలో మండల స్ధాయి అధికారులకు కూడా ప్రభుత్వం కారు వినియోగం అనుమతిచ్చింది. ప్రభుత్వం అందరికీ వాహనాలను సమకూర్చలేకపోవడంతో, వారి సొంత కార్లను కూడా హైర్ చేసుకోవచ్చని చెప్పారు. లేదా ఇతర ప్రైవేటు వాహనాలను కూడా హైర్ చేసుకునే వీలు కల్పించింది. అందుకు ఎల్లో ప్లేట్ వాహనమే వుండాలన్న నిబంధనపై కూడా అనేక వాదనలున్నాయి. ఇక పోతే మండల స్ధాయి అధికారులకే నెల నెల అలవెన్సులు ఇస్తున్నారు. అలాంటిది ప్రభుత్వంలో కీలకభూమిక పోషించే ఐఏఎస్ అధికారులకు వెహికిల్ సదుపాయం వుంటుందన్న కనీస సోయి లేకుండా ఆమె మీద ఆరోపణలు రావడం విచారకరం. అయినా ఆమె కారు కిరాయిలు ఎలా ఇవ్వాలి? ఎందుకివ్వాలన్నది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. ఆమె తన కారును కిరాయికి పెట్టి ఆ చిన్న ఆదాయం కోసం ఆశపడే అవకాశం వుంటుందా? నిజంగా ఆమె అవినీతి చేయాలనుకుంటే ఇప్పటి వరకు కొన్ని వందల కోట్లు సంపాదించేవారు. కొన్నివేల కోట్ల రూపాయల పనులు ఆమె సంతాకాలతో సాగేవి. ఆమె పర్యవేక్షణలో జరిగినవి. ఆమె ఒక్క మాటంటే మిషన్ భగీరధ కాంట్రాక్టర్లే కోట్లు కుమ్మరించేవారు. కాని ఏ ఒక్క నాడు ఆమెపై ఒక్క విమర్శ కూడ రాలేదు. ఏ ఒక్క కాంట్రాక్టర్ ఆప్ ద రికార్డు కూడా ఒక్క మాట చెప్పింది లేదు. రాజకీయాల కోసం కొన్ని విమర్శలు చేశారు. కాని అవి నిజం కాదని వారికి కూడా తెలుసు. ఇక్కడ ఆమె పర్యవేక్షణలో జరిగిన అధ్భుతం కూడా చెప్పుకోవాలి. తెలంగాణకే కాదు, దేశానికే తలమానికమైన కాళేశ్వరం వంటి ప్రాజెక్టు పనులను ఆమె పర్యవేక్షించిన తీరు అందరి ప్రశంసలు అందుకున్నది. అయితే ఆమె కాళేశ్వరం పనుల నిర్వహణలో మాత్రమే పాలు పంచుకున్నారు. కాని ఇమె ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా పని చేయలేదు. ఆమె కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే అది కూడా గత రెండేళ్ల క్రితం మాత్రమే పనిచేశారు. స్మితా సబర్వాల్ మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ఎక్కడా వీలు పడలేదు. ఆమెపై ఆరోపణలు చేయడానికి కుదరలేదు. అందువల్ల ఈ చిన్న విషయాన్ని పట్టుకొని ఆమెపై అవినీతి బుదరచల్లాలని చూస్తున్నారు. అంతే కాని ఆమె నిజాయితీ ఏమిటో మీడియాలో వున్న వారందకీ తెలుసు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క అన్నం మెతుకు చాలు. స్మిత సబర్వాల్ ఎంతటి గొప్ప అదికారో చెప్పడానికి మిషన్‌భగీరథ ఒక్కటి చాలు. అయితే ప్రసుతం ఆమె రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ సుందరి అందాల పోటీలు నిర్వంచనున్నారు. ఆ పోటీలు హైదరాబాద్‌కు తేవడంతో స్మితా సబర్వాల్ పాత్ర ఎక్కువ. అంటే ఆమె తెలంగాణ కోసం పడుతున్న శ్రమ, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు కోసం చేస్తున్న కృషి తెలిస్తే చాలు. ఎలాంటి చిల్లర వార్తలు రాయడానికి ఇక ఇష్టపడరు.