మండలం లో పలు గ్రామాలలో ఘనంగా జరిగిన సీతా రాముల కళ్యాణం !!!* శ్రీరామ నామ స్మరణ తో మారు మోగిన పలు ఆలయాలు!!!
ఎండపల్లి నేటి ధాత్రి
శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలం లోని గ్రామాలలో ఘనంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం జరిగింది,గుల్లకోట లోని వేణు గోపాల స్వామి ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది.
సమాజ సేవకులు , విగ్రహ దాతలు ముదిగంటి పద్మ రమణా రెడ్డి దంపతులు పాల్గొని స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకు రావడం జరిగింది,ఆలయ అర్చకులు ఆరుట్ల రంగా చార్యులు కళ్యాణ మహోత్సవం జరుపగా,ప్రత్యేక అర్చకుల వేద మంత్రోచ్చారణ ల మధ్య అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం జరిగింది,భక్త జనం పెద్దసంఖ్యలో భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగింది, అలాగే ఆలయాల వద్ద అన్న దాన కార్యక్రమాలు జరుగడం ,భక్తులు ఎంత గానో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ కార్య క్రమంలో,ఎంపిటిసి సభ్యులు గొల్ల పెల్లి శ్రీజ మల్లేష్ గౌడ్, , స్వాములు మహిళలు,భక్తులు పాల్గొన్నారు,అలాగే కొత్త పేట లో ఘనంగా సీతా రాముల కళ్యాణం మహోత్సవం వైభవంగా జరిగింది,మరియు రాజారాంపల్లి,కొండాపూర్,పాత గూడూరు , గొడిశెల పేట మొదలైన గ్రామాల్లో కూడా రాముల వారి ఆంజనేయ ఆలయాల్లోఅంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణం మహోత్సవం జరిగింది
అంగ రంగ వైభవంగా సీతా రాముల కళ్యాణ మహోత్సవం !!
