•కులమతాలకు అతీతంగా వేడుకలు
నిజాంపేట: నేటి ధాత్రి
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గ భవాని వేడుకలు గురువారం నాడు ఘనంగా ప్రారంభమయ్యాయి.. సింగిడి కేరళ బృందం వారిచే నృత్యాలు చేస్తూ అమ్మవారిని మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ సంవత్సరాన్ని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సంవత్సరం విగ్రహ దాతగా కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రులు శ్రీ విశ్వేశ్వర శర్మ అయ్యవారిచే అమ్మవారికి కుంకుమార్చన, అక్షరాభ్యాసం, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు 9 రోజులు రోజుకో అలంకారంలో అమ్మవారు ప్రజలకు దర్శనం ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామంలో కులమతాలకు అతీతంగా పండగలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అమ్మవారి ఊరేగింపులో ప్రతి ఒక్కరు పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ఎంపీపీ దేశేట్టి సిద్ధరాములు, లింగం గౌడ్, లక్ష్మా గౌడ్, ఎర్రగౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, వేణు గౌడ్, వెంకట్ గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.
[10:27 am, 3/10/2024] +91 96038 37520: End