
ఏఐటీయూసీ నాయకులు జి సుధాకర్ రెడ్డి, రామ్ చందర్
భూపాలపల్లి నేటిధాత్రి
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన పరిశ్రమ నుండి లాభాల వాటా ఇప్పించిన ఘనత సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీకే దక్కిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి గురుజపెళ్లి సుధాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్ లు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో సింగరేణి యాజమాన్యం కార్మికులకు 33 శాతం లాభాల వాటా ప్రకటించిన సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. 1999-2000 ఆర్థిక సంవత్సరంలో అప్పటి టిడిపి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడుతో గుర్తింపు సంఘంగా ఉన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులుగా ఉన్న కేఎల్ మహేంద్ర ప్రభుత్వాన్ని ఈ లాభాల వాటాను ఒప్పించి సాధించారని పేర్కొన్నారు.ఆ పోరాట ఫలితమేనని నేడు కార్మికులు అనుభవిస్తున్న లాభాల వాటా అని పేర్కొన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం పంచడం జరుగుతుందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల హక్కులు సంక్షేమం కోసం పోరాడేది ఏఐటీయూసీ మాత్రమేనని అన్నారు. గతంలో ఆర్థిక సంవత్సరంలో లాభాల32 శాతం వాటను 33 శాతం కు పెంచే విధంగా ఏఐటీయూసీ నాయకుల పోరాట ఫలితమేనని కార్మికులు గ్రహించాలని వివరించారు. ఎప్పుడు లేని విధంగా వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడం కోసం కార్మికుల జీతం నుండి కాకుండా సంస్థ యొక్క అభివృద్ధి నిధుల నుండి వరద సహాయం అందజేసే విధంగా ఏఐటియుసి గుర్తింపు సంఘం కృషి చేసిందన్నారు. నిరంతరం కార్మికుల సంక్షేమం లాభాల బాట సాధనకు కృషి చేసిన ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శి లు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్ కుమార్ లకు కార్మికులు, ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ పక్షాన ఈ సందర్భంగా వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాలన్నీ కార్మికులు గ్రహించాలని ఏఐటియుసి పోరాటాలకు మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకులు నూకల చంద్రమౌళి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.