
మందమర్రి, నేటిధాత్రి:-
సింగరేణి క్రీడా కారులు కోల్ ఇండియా పోటీల్లో రాణించి, సంస్థకు పేరు తీసుకురావాలని ఏరియా జిఎం ఏ మనోహర్ తెలిపారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో డబ్ల్యూపిఎస్ జిఏ వారి ఆధ్వర్యంలో 59వ వార్షిక క్రీడల్లో భాగంగా మంగళవారం సిఈఆర్ క్లబ్ లో నిర్వహించిన క్రీడా కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా ఏరియా జనరల్ మేనేజర్ ఏ మనోహర్ హాజరై, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్ నియర్ బై ఏరియా క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని కంపెనీ లెవెల్ కోల్ ఇండియా స్థాయి పోటీల్లో పాల్గొని మందమర్రి ఏరియాకు సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త ఎ రవికుమార్, క్రీడల జనరల్ కెప్టెన్ టీ చిన్నయ్య, శ్రీముర హరి, క్రీడల సమన్వయకర్త, జిపి చంద్రకుమార్, పిల్లి వెంకటేశ్వర్లు, గ్రౌండ్ ఇంచార్జ్ నస్పూర్ తిరుపతి, క్రీడాకారులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.