
Celebrations
రజతోత్సవ సభను విజయవంతం చేయండి
మహిళా ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి
పరకాల నేటిధాత్రి
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పరకాల పట్టణ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి సాంబరాజు జ్యోతి పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా జ్యోతి మాట్లాడుతూ నిధులు,నీరు,నియామకాల్లో అనే నినాదలతో 25 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిందన్నారు.తెలంగాణ సాధన కోసం బీఆర్ఆఎస్ పుట్టిందని అన్నారు.పార్టీ ఏర్పాటు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అడుగులు వేసిందని రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ పోరాడారని గుర్తుచేశారు.పరకాల పట్టణం నుండి సభకు నాయకులు,మహిళా నాయకురాళ్లు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.