ఎస్సై రాత పరీక్షకు పోలీసుల ఆధ్వర్యంలో ‘హెల్ప్’ డెస్క్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శని, ఆదివారాల్లో జరిగే స్టయిఫండరీ సబ్ ఇన్‌స్పెక్టర్ తుది రాతపరీక్షకు నగర పోలీస్ కమీషనర్ డాక్టర్ వి.రవీందర్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎస్సై తుది రాత పరీక్షకు సుదూర ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో బస్, రైల్వేస్టేషన్లతోపాటు ముఖ్యమైన కూడళ్లల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలియజేయడంతోపాటు అభ్యర్థులు తెలుసుకునేందుకు వీలుగా ముఖ్యకూడళ్లలో పరీక్షా కేంద్రానికి దారిని తెలుపుతూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో పరీక్ష రాసే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పోలీసులు అందిస్తున్న సహకారానికి తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.