
జమ్మికుంట ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు
=-=-=-=-==-=-=-=-=-==-=
జమ్మికుంట పట్టణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, నిరంతరం సమాజం కోసం పరితపించే వ్యక్తి, హిందూ ధర్మస్థాపనకై విశ్వహిందూ పరిషత్ లో పనిచేసిన వ్యక్తి, సమాజంలో ఏ వ్యక్తిని కూడా కించపరచకుండా వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీ క్రీ, శేషులు గుండా తిరుపతయ్య గారి సంతన సభ నిర్వహించుకోవడం చాలా బాధగా ఉందని ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవాహ శ్రీ మల్లుజుల కిషన్ రావు, శ్రీ సరస్వతీ శిశు మందిర్ వ్యవస్థాపక అధ్యక్షులు పూజారి సాంబయ్య గారు అన్నారు.
ఈ కార్యక్రమాన్ని గుండా తిరుపతి గారి గృహం నందు ఆర్యవైశ్య సంఘం కమిటీ మరియు సనంద ఫౌండేషన్ మరియు సంఘ పరవార క్షేత్రం ఆధ్వర్యంలో కళాకారులచే నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు చందా రాజు, నరసయ్య, ఒల్లాల బాబు శెట్టి, ముక్క జితేందర్ గుప్తా, గరేపల్లి రాజమౌళి, బచ్చు వీరలింగం, పరివార క్షేత్ర కార్యకర్తలు జడ్పీ చైర్మన్ కనుమల విజయ,తేల రాజమౌళి, పుల్లనేని సుధాకర్ రావు, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, టంగుటూరి రాజకుమార్, సంపెల్లి సంపత్ రావు, చిదురాల శ్రీనివాస్, సందిరి సారంగపాణి, మంతెన శ్రీమన్నారాయణ, బుర్ర శివయ్య, భీష్మ చారి, నరహరి మరియు వందల మంది పాల్గొని ఘన నివాళులర్పించారు.