చౌటుప్పల్ నేటి ధాత్రి:
శ్రీ దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని కురుమ సంఘం చౌటుప్పల మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం కోశాధికారి చిన్నం బాలరాజు కురుమ మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం మహిళల పై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఆనాడు ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య ముందుండి పోరాడి నిజం సైనిక రజాకార్ల తుపాకుల గుండ్లకు ఎదురొడ్డి నిలిచి బలై సాయుధ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆ విప్లవ వీరున్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని నేటి సమాజంలో జరుగుతున్న బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఆర్థికంగా అణిచివేత మహిళలపై దాడులు వివిధ సమస్యలపై ప్రజలను చైతన్యం చేసి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి రాజ్యాధికారం సాధించినరోజే ఆ విప్లవ వీరుని ఆశయాలు సాధించిన వాళ్ళం అవుతాం అన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఆలే నాగరాజు కురుమ, జిఎంపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు నరసింహ, కురుమ మండల అధ్యక్షులు కొండే శ్రీశైలం కురుమ, నాయకులు కడగంచి చలమంద, రాజు కురుమ ,రాజేష్ కురుమ, నారి బాలరాజు కురుమ ,చిన్నం శివశంకర్ కురుమ ,డోకె వెంకటేష్ కురుమ ,నరసింహ తదితరులు పాల్గొన్నారు.