
చందుర్తి, నేటిదాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం, మల్యాల గ్రామంలోని వేలనాటి శ్రీ భక్త ఆంజనేయ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట గురువారం రోజున అంగరంగ వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు రెండు మూడు రోజులపాటు పూజలు అందుకున్న శ్రీ ఆంజనేయ స్వామి గురువారం రోజున విగ్రహ ప్రాణ ప్రతిష్ట కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాలుగొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అర్చకులు స్వామి వారి ప్రసాదం. అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మల్యాల గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆంజనేయ స్వామి వారిని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు హనుమాన్ దేవాలయ కమిటీ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.