
సన్మానించిన గౌతమి హై స్కూల్ యాజమాన్యం
#నెక్కొండ , నేటి ధాత్రి:
ఆధ్యాత్మిక ,వేద జ్యోతిష రంగాలలో నెక్కొండ కు చెందిన బూరుగుపల్లి శ్రవణ్ శాస్త్రి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని గౌతమి విద్యానికేతన్ హై స్కూల్ కరస్పాండెంట్ అనంతుల మురళీధర్ ,ప్రిన్సిపల్ కల్పనలు అన్నారు.
ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత, గౌతమి విద్యానికేతన్ హై స్కూల్ పేరేంట్, ఆత్మీయ మిత్రుడు బూరుగుపల్లి శ్రవణ్ శాస్త్రి ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23న న్యూఢిల్లీలో జరిగిన వేద జ్యోతిష్య సమ్మేళనంలో ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న సందర్భంగా ప్రిన్సిపల్ ఆనంతుల కల్పన అధ్యక్షతన పాఠశాలలో అభినందన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరస్పాండెంట్ అనంతల మురళీధర్ మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ లో పీజీ పూర్తి చేసిన శ్రవణ్ రెండు దశాబ్దాలుగా వేదిక్ ఆస్ట్రాలజీలో పరిశీలనలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తుండటం ప్రశంసనీయమన్నారు. ఢిల్లీ వేదికగా పాఠశాల పేరంటైన శ్రవణ్ అవార్డు అందుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, వారి సేవలు మరింత విస్తృతం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రవణ్ శాస్త్రికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మధుకర్ రెడ్డి, అజయ్ కుమార్, సుజిత్, శిరీష తదితరులు పాల్గొన్నారు.