
Corporation Chairman N. Giridhar Reddy.
జనహిత పాదయాత్రలో భాగంగా శ్రమదానం – మొక్కలు నాటిన కాంగ్రెస్ నేతలు
◆:- నేడు సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర
◆:- జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుండగా. సంగుపేట నుంచి జోగిపేట వరకు సాగనుంది. ఈ పాదయాత్రలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెస్ నేతలుహాజరుకానున్నారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కొనసాగుతున్న జనహిత పాదయాత్రలో భాగంగా, జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి.మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు.ఈ సందర్భంగా జనహిత పాదయాత్రకు బయలుదేరిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొంటున్నారు.