
విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్.
హైదారాబాద్,నేటిధాత్రి:
విశ్వభారత్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా శివ వుల్క్ందకార్ ఎన్నికయ్యారు. బాధ్యతలు చేపట్టిన శివ వుల్క్ందకార్ సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి సమక్షంలో పార్టీ జాతీయ స్థాయి నేతలు రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకురాలు యస్.రమాదేవి చేతుల మీదగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా శివ వుల్క్ందకార్ కు నియామక పత్రాన్ని అందజేశారు.తదనంతరం ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం,కార్మిక,కర్షక,ఉద్యోగ,విద్యార్థి,యువత,మహిళా నిరుద్యోగుల సమస్యలపై శాంతియుత ఉద్యమాలు,పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజ సేవకుల ఎన్నిక ఏప్పుడు,ఏక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వుండాలని కోరారు.నూతంగా ఎన్నికైన రాష్ట్ర అద్యక్షుడు శివ వుల్క్ందకార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని క్షేత్రాస్తాయి నుండి పటిష్టమైన నాయకత్వం నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు పార్టీని హక్కున చేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతానని అన్నారు. రాష్ట్ర ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలు చేస్తానన్నారు.ప్రజ సేవా చేయడానికి పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశమని, పార్టీ వ్యవస్థాపకురాలు,జాతీయ అధ్యక్షురాలు యస్. రమాదేవి, జాతీయ,రాష్ట్ర నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.