రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు గొర్రెకుంట విద్యార్థులు

వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

ఈ నెల 4న మహబూబాబాద్ పట్టణంలోని ఎన్టిఆర్ క్రీడా ప్రాంగణంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బేస్ బాల్ క్రీడా పోటీలకు పాఠశాలల ఎంపిక క్రీడా పోటీలలో గీసుకొండ మండలం 15 వ డివిజన్ పరిధిలోని గొర్రెకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొని వారి క్రీడా ప్రతిభతో రాష్ట్రస్థాయి బేస్ బాల్ పాఠశాలల క్రీడలకు ఎంపికైనట్లు పాటశాల ప్రధానోపాధ్యాయురాలు నలిమెల జ్యోతిర్మయి తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బేస్ బాల్ క్రీడా పోటీలకు పాఠశాలల ఎంపిక క్రీడా పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఎల్.అన్షు,ఎన్.అభినందన్,ఎల్.రిషి లు ఉత్తమ ప్రతిభ కనబర్చి ఈనెల 8,9,10వ తేదీలలో తొర్రూర్ పట్టణంలో జరుగు రాష్ట్రస్థాయి బేస్ బాల్ పాఠశాలల క్రీడలకు(14సం) ఎంపికయ్యారని చెప్పారు.తమ క్రీడా ప్రతి‌భతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిచిట్లు పేర్కొన్నారు.ముఖ్య అతిథిగా స్థానిక కార్పోరేటర్ ఆకుల మనోహర్,విద్యాకమిటి ఛైర్మన్ జున్ను కుమారస్వామి, పాఠశాల ఉపాధ్యాయ బృందం షహీన్ సుల్తాన,యం.చంద్రశేఖర్, మార్త.శ్రీనివాస్,సి.హెచ్.అనిత,పి.ప్రణతికుమారి,యం.ప్రభాకర్ ,జె.దమరి ,ఆర్.రాజు,సి.హెచ్.శ్రీదేవి,పిఇటి జె.రఘవీర్ మరియు గ్రామస్థులు ,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!