నేటిధాత్రి ప.గో జిల్లా/ భీమవరం
ఐదవ రోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మంగళవారం నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఏడు మంది అభ్యర్థులు కొత్తగా నామినేషన్ లు దాఖలు చేయగా, ఇంతకు ముందే నామినేషన్ లు దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థులు ఒకరు రెండు సెట్స్, మరియొకరు ఒక సెట్ నామినేషన్ ను దాఖలు చేయడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ తరపున భూపతి రాజు శ్రీనివాస్ వర్మ రెండు సెట్లు నామినేషన్లను రాజ్యసభ సభ్యులు అరుణ్ సింగ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తణుకు నియోజకవర్గ అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణన్ లతో కలిపి నామినేషన్ పత్రాలను నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ కు అందజేయడం జరిగింది.
బిజెపి తరఫున కలిదిండి వినోద్ కుమార్ వర్మ , స్వతంత్ర అభ్యర్థులుగా మాడపాటి వెంకట వరాహలరెడ్డి, కేత శ్రీను, రామ దుర్గాప్రసాద్, గేదల లక్ష్మణరావు, అద్దేపల్లి వీర వెంకట సుబ్బారావులు ఒక్కొక్క సెట్ నామినేషన్ లను దాఖలు చేయడం జరిగింది. ఇంతకుముందే నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్సిపి అభ్యర్థి గూడూరి ఉమా బాలా తరఫున రెండు సెట్లు, గూడూరి జగదీష్ కుమార్ వైఎస్ఆర్సిపి ఒక సెట్ నామినేషన్నులను దాఖలు చేయడం జరిగింది.
నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీగా ఇప్పటివరకు 14 మంది అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లను దాఖలు చేయడం జరిగింది.
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళవారం పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలు మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో 19 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది