24ఏళ్ల తర్వాత నాటి ఉపాధ్యాయులతో కలిసి కలుసుకున్న పూర్వ విద్యార్థులు…..
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:- శేరిలింగంపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తయిన 24 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్హులంతా ఒకచోట చేరి పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం శేరిలింగంపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఉపాధ్యాయులను కలుసుకొని నాటి తీపి గుర్తులను పంచుకున్నారు. ఈ సందర్బంగా 2000 సంవత్సరంలో ఉపాధ్యాయులుగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు.వారు చదువుకున్న తరగతి గదులకు వెళ్లి నాటి స్మృతులు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ..24 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులంతా ఒక చోట చేరడం అభినందనీయమని, అదేవిధంగా ఈ సన్మాన కార్యక్రమం తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పూర్వ విద్యార్థులందరూ ముందు ముందు పలు సమాజ సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సందర్బంగా ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఈటి లక్ష్మీ టీచర్, గిరిజా టీచర్, వర్ణమాల టీచర్, వసంత టీచర్ తోపాటు పలువురు పాల్గొన్నారు.