శేరిలింగంపల్లి, నేటి ధాత్రి:-శేరిలింగంపల్లి డివిజన్ లోగల రాజీవ్ గృహకల్పలో పూర్తయినా సిసి.రోడ్డు నిర్మాణం పనులను శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, స్థానిక నాయకులతో, మహిళా నాయకురాళ్ళతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సిసి. రోడ్ల నిర్మాణానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. స్థానికవాసులు మిగిలిన సిసి రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టగలరని విజ్ఞప్తి చేశారు. స్థానికవాసులు కాలనీలోని సమస్యలను రాగం నాగేందర్ యాదవ్ కి విన్నవించగా పరిష్కరిస్తానని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రధాన డ్రైనేజీ సమస్యలను సత్వరమే చర్యలు చేపట్టే విధంగా వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి తో స్వయంగా చర్చించి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకళ, చంద్రకళ, యోగి, మహేందర్, సుధాకర్, బసవయ్య, షఫీ, హరి, శ్రీను, సురేష్, సత్తర్, వెంకట్ రెడ్డి, కుటుంబరావు, జమ్మయ్య, మహిళా నాయకురాళ్లు దీప, కుమారి, సుధారాణి, గౌసియా, ఫాతిమ, శశికళ, సుజాత, స్వరూప, కళ్యాణి, లక్ష్మి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు లను పర్యవేక్షించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్
