విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం పెద్దకోడేపాక పాఠశాలలో స్వయం పాలనా దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచియని, ఎంతో విలువైన వృత్తిలో కొనసాగుతున్నందుకు గర్వపడాలి అని పెద్దకొడేపాక ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయులు కాసర్ల చంద్రమౌళి అన్నారు
పాఠశాలలో జరిగిన స్వయం పాలన దినోత్సవంలో అద్యక్షత వహించి, ఉపాద్యాయులుగా వ్యవహరించిన విద్యార్థి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు నేటి స్వయం పాలన దినోత్సవం లో డీఈఓగా ఆలూరి సాయి గణేశ్, డిప్యూటీ డిఈఓగా జక్కుల అభినయ్ , మండల ఎంఈఓ గా బైరి రామ్ చరణ్ ప్రధానోపాధ్యాయురాలుగా మంద రోహిణిలు వ్యవహరించగా వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా పాఠశాల విద్యార్థులు క్లాసులు బోధించారు. జడ్జిలుగా కాంప్లెక్స్ ఉపాధ్యాయులు శ్రీధర్, రఘు, రజిత లు వ్యవహరించగా తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ శ్యామల పవన్ అందించిన మెమొంటోలను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు,పాఠశాల విద్యార్థులకు అందజేశారు.