మంగపేట నేటి ధాత్రి
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో సోమవారం రాత్రి ఓవర్ లోడ్ తో వస్తున్న రెండు ఇసుక లారీలను సీజ్ చేసినట్టు మంగపేట ఎస్సై గోదారి రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కమలాపురంలో మంగపేట పోలీసులు వెహికిల్ చెకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సాంబయ్యగూడెం నుంచి ఇసుక ఓవర్ లోడ్ లో తీసుకొని వస్తున్న రెండు ఇసుక లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేశామని చెప్పారు.