మంగపేట నేటి ధాత్రి
మంగపేట మండలం నుండి ఓవర్ లోడ్ తోవెళ్ళుతున్న 8 ఇసుక లారీలను ఆదివారం తనిఖీలు చేసి వాటిని మంగపేట ఎస్ఐ రవికుమార్ సీజ్ చేసినట్లు తెలిపారు. ఓవర్లోడ్తో ఇసుక లారీలు కనిపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఇసుక లారీ యజమానులను, డ్రైవర్లను హెచ్చరించారు.మంగపేట మండలంలో ఇసుక క్వారీలు ఎక్కువగా ఉండటంతో రోడ్డు పైనే ఇసుక లారీలను ఆపి ప్రమాధాలకు కారనమవుతున్న ఇసుక లారీలపై పోలీసులు లాఠీ జులిపిస్తున్నారు. ప్రత్యేక స్థలంలో పార్కింగ్ చేయాలని చెప్తున్నా పట్టించు కోవడం లేదని దీనితో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మంగపేట మండలం నుండే కాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి కూడా ఓవర్లోడ్తో ఇసుక లారీలు పెద్ద ఎత్తున మంగపేట మండలం నుండే వెళ్ళుతున్నాయి.దీనితో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఇసుక లారీల సమస్యను తీసుకెళ్ళడంతో అధికారుల ఆదేశాల మేరకు మంగపేట మీదుగా ఓవర్లోడ్తో వెళ్ళుతున్న ఇసుక లారీలను తనిఖీ చేసి ఒక్కో లారీలో సుమారు 10టన్నులు ఇసుక అధనంగా ఉండటంతో 8 లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ తెలిపారు. అదే విధంగా ఇసుక కాంట్రాక్టర్లను, లారీ యజమానులను, లారీ డ్రైవర్లను ఎస్ఐ హెచ్చరించారు.